కేటీఆర్ కమీషన్ 20 శాతం

Spread the love

కేసీఆర్‌ విధానాలు అత్యంత ప్రమాదకరం


యశోథాకు రూ. 100 కోట్లకే కేటీఆర్ కమీషన్ 20 శాతం. 800 కోట్ల భూమి


ఎకరాకు 5 లక్షల చదరపు గజాల్లో నిర్మాణాలకు కు అనుమతి


అందులో కేటీఆర్ కమీషన్ 20 శాతం


ఆరోపణలు తప్పని నిరూపించాలని కేటీఆర్ కు సవాల్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. “భూ దోపిడీ చేసిన సొమ్ములతో కేసీఆర్ దేశంలో రాజకీయ పార్టీలకు ఎర వేస్తున్నాడు. కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలతో సమానం. కేసీఆర్ రాజకీయ జూదగాడు. ప్రజాస్వామ్యాన్ని జూదంగా మార్చి, ఎన్నికలను ధనమయం చేసి దేశాన్ని అస్థిర పరచాలన్న కుట్రపూరిత ఆలోచనతో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్‌ విధానాలు అత్యంత ప్రమాదకరం” అని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తన అనుచరులకు నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయిస్తూ కోట్ల రూపాయలను దోపీడీ చేస్తున్న వైనంలో భాగంగా నిన్న హెటిరో పార్థసారధి రెడ్డి వ్యవహారాన్ని నిన్న వెలుగులోకి తెచ్చిన రేవంత్ రెడ్డి ఈ రోజు యశోథా సంస్థకు భూముల కట్టబెట్టడం వెనుక జరిగిన కుట్రను బయట పెట్టారు.

రూ. 800 కోట్లకే భూమి..రూ 100 కోట్లకే
రూ.800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 100 కోట్ల కే యశోథా సంస్థకు కేటాయించినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2010 లో వైద్య ఆరోగ్య రంగంలో పరిశోధనలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాకు చెందిన అలగ్జాండ్రియా అనే కంపెనీకి శేరిలింగంపల్లి మండలం, ఖానాపూర్ గ్రామం సర్వే నెంబర్ 41/14 లో ఐదు ఎకరాల స్థలాన్ని, ఎకరం రూ.10 కోట్ల చొప్పున ధర నిర్ణయించి కేటాయిస్తూ సేల్ డీడ్ చేసుకుంది.

అయితే జీవో నెంబర్ 1484, లోకాయుక్త అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అక్కడ ఎకరం ధర రూ. 10 కోట్లు కాదు, రూ.12 కోట్లు ఉందని నిర్ధారణ కావడంతో ఈ మేరకు ఆ సర్వే నెంబర్ లో స్థలం పొందిన అలగ్జాండ్రియాతో పాటు మారుతి సుజుకీ కంపెనీలకు 05 – 06 – 2012న హెచ్ఎండీఏ లేఖ రాసింది. సదరు సర్వే నెంబర్ లో ఎకరం రూ.12 కోట్లు ధర పలుకుతున్నందున ముందుగా చెల్లించిన మొత్తానికి అదనంగా… ఎకరానికి రూ.2 కోట్లు చెల్లించాలని ఆ లేఖలో పేర్కొంది.

ఈ లేఖపై స్పందించిన మారుతి సుజుకీ తనకు కేటాయించి రెండు ఎకరాల స్థలానికి అదనంగా చెల్లించాల్సిన రూ.4 కోట్లు చెల్లించింది. అలగ్జాండ్రియా మాత్రం ఈ అంశం పై కోర్టుకు వెళ్లింది. కోర్టులో ఈ వివాదం నడుస్తుండగానే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖానామెట్ గ్రామంలో సర్వే నెంబర్ 41/14లో ఉన్న భూమిపై కల్వకుంట్ల మాఫియా కన్నుపడింది. అలగ్జాండ్రియాకు కేటాయించిన ఐదెకరాలు, దాని పక్కనే ఉన్న మరో మూడెకరాలు అత్యంత ఖరీదైన భూమిపై కల్వకుట్ల మాఫియా కన్నుపడింది. అప్పటికే అలగ్జాండ్రియాకు కేటాయించిన భూమి ధర వివాదం కోర్టులో ఉండటంతో… దానిని సాకుగా చూపి అలగ్జాండ్రియాను బెదిరించి… 2016లో అలగ్జాండ్రియా కంపెనీలోకి కల్వకుంట్ల జగన్నాథరావు, గోరుకంటి రవీందర్ రావు, గోరుకంటి దేవేందర్ రావు డైరెక్టర్లుగాచొరబడ్డారు.

జగన్నాథ రావుకు కల్వకుంట్ల అనే ఇంటి పేరు తప్ప ఎటువంటి అర్హత లేదని తెలిపారు. ఆ విధంగా అలగ్జాండ్రియా అనే కంపెనీ కల్వకుంట్ల మాఫియా సొంతమైంది. ఆ తర్వాత కోర్టులో ఉద్ధేశ పూర్వకంగానే కేసు ఓడిపోయి… తన మాఫియా సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న అలగ్జాండ్రియాకు రూ.500 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేసింది. కల్వకుంట్ల మాఫియా ఈ భూమిని కొట్టేయాలన్న పక్కా ప్రణాళికతో ఉంది కాబట్టే కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లలేదు.

ఈ కారణంగా ప్రభుత్వ ఖజానాకు అదనంగా రావాల్సిన రూ.10 కోట్లు (5 ఎకరాలు × 2 కోట్లు = 10 కోట్లు) రాలేదు. రూ.500 కోట్ల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి అతి తక్కువకే కల్వకుంట్ల మాఫియా పరమైంది. 2018 లో ఈ భూ వివాదంపై కావాలనే కేసు ఓడిపోయారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సుప్రీం కోర్టులో ఎందుకు అప్పీల్ కు వెళ్లలేదు? అని రేవంత్ ప్రశ్నించారు. అర్హత లేకపోయినా వారికి కట్టబెట్టిన భూమిని వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందన్నారు.


ఇక్కడితో కల్వకుంట్ల భూ మాఫియా దాహం తీరలేదు. ఆ పక్కనే ఇదే సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమి మూడెకరాలపై వాళ్ల కన్నుపడింది. దానిని కూడా అగ్గువ సగ్గువకు కొట్టేసే కుట్రకు మళ్లీ తెర లేచింది. వాస్తవానికి హైటెక్ సిటీ సమీపంలో ఉన్న ఈ భూమి ధర 2017లో గజానికి రూ. రెండు లక్షలకు తక్కువ లేదు. అంటే ఎకరా సుమారుగా రూ.100 కోట్లు. ఇదే సర్వే నెంబర్ లో మెయిన్ రోడ్ ఫేస్ ఉన్న 14,278 గజాల (సుమారు మూడెకరాలు) ప్రభుత్వ భూమిని యశోథా గ్రూప్ గజం రూ.37,611 కు కొనుగోలు చేసింది.

అంటే ఎకరం సుమారు రూ.18.20 కోట్లు మాత్రమే. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు 10-08-2016 నాడు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధరే ఎకరాకు రూ.33.70 కోట్లు ఉంది. అదే సమయంలో యశోథా గ్రూప్ కొనుగోలు చేసిన మూడు ఎకరాల (14,278 గజాలు) ప్లాటుకు ఆనుకుని వెనుకవైపు ఉన్న ప్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ గజానికి రూ.80 వేలు అప్ సెట్ ప్రైస్ గా నిర్ధారించింది.

అంటే ఎకరాకు రూ.39 కోట్లు అన్నమాట…ఈ రెండు ధరలను కాదని కేవలం రూ.18.20 కోట్లకే యశోథా గ్రూప్ ప్రభుత్వ భూమిని సొంతం చేసుకుందంటే దోపిడీ ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్టు అర్థమవుతోంది. ఈ భూ దోపిడీలో అలగ్జాండ్రియాలో రూ.500 కోట్లు, యశోథా గ్రూప్ కు కట్టబెట్టిన రూ.300 కోట్లు (హైటెక్ సిటీ సమీపంలో 2017లో గజం రూ.2,00,000 తక్కువ లేదు. ఆ లెక్కన యశోథ గ్రూప్ కు కట్టబెట్టిన మూడెకరాలు వాస్తవ విలువ రూ.300 కోట్లు) కలిపితే మొత్తం రూ.800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 100 కోట్ల కే కొట్టేశారు.


ఖానామేట్ లో 41/14 సర్వే నంబర్ లో 8ఎకరాలు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. అలెగ్జాన్డ్రియా కంపెనీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించాలని 2010 లో దరఖాస్తు చేసుకుంది. 5ఎకరాలు ఆ కంపెనీకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 50కోట్లకు భూమిని కేటాయించింది. మారుతీ సుజుకి కంపెనీకి 2 ఎకరాలు కేటాయించింది. ఎకరాకు 12 కోట్ల విలువ ఉందని లోకాయుక్త కోర్టులో కేసు వేశారు.

ప్రభుత్వం జరిగిన తప్పిదాన్ని గమనించి రెండు “భూములు కొల్లగొట్టి కేసీఆర్ లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారు. అక్రమ సంపాదనతో కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. ఉద్యమకారుడినని చెప్పుకున్న కేసీఆర్ కు వేల ఎకరాల భూములు ఎలా వచ్చాయి? ఫామ్ హౌసులు ఎలా వచ్చాయి? పేద ప్రజలకు చెందాల్సిన సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంది.

కేసీఆర్ ను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం తెలంగాణ సమాజంపై ఉంది” అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగుల కుటుంబాలకు తలా లక్ష రూపాయలు సాయం చేయాలని కేసీఆర్ ఎందుకు ఆలోచించలేదు. ఆ భూములను అమ్మితే రూ.2500 కోట్లు వస్తాయి. ఆ సొమ్ముతో నిరుద్యోగులను ఆదుకోవచ్చు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అనుమతులు
రేపు అత్యంత కీలకమైన లిక్కర్ కుంభకోణంలో ఉన్న వ్యక్తులకు కేటాయించిన భూముల వివరాలను, వారి బంధాన్ని బయటపెడతా అన్నారు రేవంత్ రెడ్డి. తాను ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని నిరూపించాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు.

ఒక వేళ తన ఆరోపణలను తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు రేవంత్. వాస్తవాలు మాట్లాడితే కేటీఆర్ దబాయించి తప్పించుకోవాలని చూస్తున్నారు. నా ఆరోపణలపై విచారణ చేయించండి.. తప్పైతే దేనికైనా సిద్ధం అని సవాలు విసిరారు. గతంలో జన్వాడలో భూమి లేదని చెప్పిన కేటీఆర్ … తన భార్య పేరుతో ఉన్న భూమి వివరాలు బయటపెడితే మాట్లాడలేదు.

లిక్కర్ కుంభకోణంలో ఉన్న వారికి ఖానామేట్ లో 25 ఎకరాలు అప్పగించింది వాస్తవం కాదని నిరూపిస్తారా? నగరంలో భవనాల అనుమతుల్లోనూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. భూ ప్రపంచంలో ఎక్కడా ఎకరాకు లక్ష, లక్షన్నర చదరపు గజాలకు అనుమతి ఇవ్వరు. కానీ ఇక్కడ ఎకరాకు 5 లక్షల చదరపు గజాలకు అనుమతిస్తున్నారు. అందులో 20 శాతం కమీషన్ల కోసం కేటీఆర్ ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు.

ఇది నగరానికి అత్యంత ప్రమాదకరం. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, నాగార్జున సర్కిల్ లో భవనాలకు అదనపు అంతస్థులకు అనుమతులు ఎలా ఇచ్చారో కేటీఆర్ చెప్పాలి. ఇలాంటి విధానాలతో నార్సింగి, పుప్పాలగూడా ప్రాంతాల్లో భవిష్యత్తులో ఎవరూ నివసించలేని పరిస్థితి వస్తుంది అని ఆయన విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ కేబీఆర్ పక్కన నమస్తే తెలంగాణకు 3వేల గజాలు ఎలా వచ్చిందో చెప్పాలి. 5 అంతస్తులు కట్టాల్సిన బిల్డర్ 16 అంతస్తులు కడుతుంటే కేటీఆర్ ఏం చేస్తున్నారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

671 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?