
అసెంబ్లీ ఎవడబ్బ సొత్తు..!
పొంగులేటి పై మండిపడ్డ ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఫైర్ అయిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
సత్తుపల్లి పట్టణ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం లో కామెంట్స్
అసెంబ్లీ గెట్ నీ అబ్బ సొత్తు కాదు… బరాబర్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో అడుగు పెడతారు
నీకో రాజకీయ జెండా లేదు.. ఎజెండా లేదు.. అమాయకులైన నలుగురు నాయకులను వెంటేసుకుని తిరుగుతున్నావు. వాళ్లను రాజకీయంగా అన్యాయం చేయడం తప్ప ఏమీ ఉండదు.
కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన అవకాశాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేసుకున్నావు.. కానీ అదే క్రమంలో ఆర్ధికంగా లాభపడ్డావు.
అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ లు ఇచ్చిన వారిని ఓడించడానికి కుయుక్తులు పన్నావు. అయినా కేసీఆర్ గారు ఓపికతో ఎదురు చూశారు. కానీ నీలో మార్పు రాలేదు.
ఇటుక, ఇటుక పేర్చి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని శక్తి వంతంగా చేశారు. ఈ పార్టీ ని ఓడించడం ఎవరి తరం కాదు.