
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..
సుప్రీం కోర్టులో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు చుక్కెదురైంది.
ఎన్నికల సందర్భంగా మల్లయ్య యాదవ్ తన ఆస్తుల వివరాలు సరిగా చెప్పలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఎన్నికల తర్వాత కేసు పెట్టారు.
అయితే ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
అయితే తన వివరణ తీసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్.
ఎమ్మెల్యే మల్లయ్య వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. హైకోర్టులో ఇంత కాలం ఎందుకు సమాధానం చెప్పలేదని.. సుప్రింకోర్టు పిటీష్నర్ను ప్రశ్నించింది.
మీ అడ్వకేట్ తో కమ్యునికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు.
3,797 Views