వేరే మహిళతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన SI..

Spread the love

వేరే మహిళతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన SI.. దుమ్ము దులిపిన భార్య!

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. వివాహ బంధాన్ని ఎగతాళి చేస్తూ.. మూడు ముళ్లను, ఏడు అడుగులను అపహాస్యం చేస్తూ కొందరు అడ్డదార్లు తొక్కుతున్నారు.

కట్టుకున్న వారికి మోసం చేస్తున్నారు. తాజాగా, ఓ ఏఆర్‌ ఎస్‌ తన భార్యను కాదని మరో మహిళతో సహజీవనం చేయటం మొదలుపెట్టాడు.

ఈ విషయం తెలిసిన భార్య వారుంటున్న ఇంటి దగ్గరకు వెళ్లింది. భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని బుద్ది చెప్పింది. ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.

స్థానికులు, బాధిత మహిళ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన వాసు, సామ్రాజ్యం భార్యాభర్తలు. వీరికి 30 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. వాసు ఏఆర్‌ ఎస్‌ఐగా పని చేస్తున్నాడు.

ప్రస్తుతం నెల్లూరులో విధులు నిర్వహిస్తున్నాడు. 2017నుంచి వాసుకు అతడి భార్య సామ్రాజ్యానికి మధ్య మనస్పర్థలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు భార్యను పట్టించుకోవటం మానేశాడు. ఇంటికి కూడా రావటం లేదు.

దీంతో సామ్రాజ్యానికి అనుమానం వచ్చింది. భర్త గురించి విచారించగా అతడు వేరే మహిళతో ఉంటున్నట్లు తెలిసింది. తాజాగా, ఆమె వారు ఉంటున్న ఇంటికి వెళ్లింది. నెల్లూరు పోస్టల్‌ కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరినీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ఆగ్రహంతో భర్తకు దేహశుద్ధి చేసింది. అందరి ముందూ చితక బాదింది. భర్త సదరు మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. భర్త తనకు కావాలని డిమాండ్‌ చేస్తోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

7,941 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?