
ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడటంతో గాయాలపాలైన రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని మేడిపల్లిలో శనివారం జరిగింది.
ఎస్సై శివానందం తెలిపిన వివరాలు.. మేడిపల్లికి చెందిన కోరెపు రాజిరెడ్డి(58) రైతు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు సంతోష్‌రెడ్డి ఉన్నారు. రాజిరెడ్డి శనివారం మధ్యాహ్నం సొంత పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా బోల్తా పడింది. ఆయన ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయాడు.
చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని గ్రామస్థుల సాయంతో ట్రాక్టర్‌ను పక్కకు తొలగించారు.
గాయాలపాలైన రాజిరెడ్డిని ఓ ప్రైవేటు వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికి మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
చేర్యాల మండలంలోని కడవేర్గు శివారులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైందని ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. పెట్రోల్‌బంకు సమీపంలో రహదారికి 100 మీటర్ల దూరంలో పొలంలో నగ్న స్థితిలో మృతదేహం పడి ఉంది. వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుంది.
గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి పడేశారు. కొద్ది దూరంలో ప్యాంటు, చొక్క, లోదుస్తులు పడేశారు. ఘటన రెండ్రోజుల కిందట జరిగి ఉంటుంది. మృతదేహం కుళ్లిపోయే దశకు చేరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. సీఐ సత్యనారాయణరెడ్డితోపాటు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు.