కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పండి

Spread the love

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్..

నీళ్ళు, నిధులు, నియామకాలు కోసం ఉద్యమం జరిగింది, అన్ని వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే దక్కాయి..

సాధించుకున్న తెలంగాణ ను రెండు విడతలుగా కెసిఆర్ పరిపాలిస్తున్న తీరు చూస్తున్నాం..

స్వయం లాభం, స్వార్థం కోసం మీ పార్టీ పేరు మార్చుకున్నారు..

రాష్ట్రం వస్తె బతుకులు మారతాయి అని ఆశించారు.. ఇంటికి పది లక్షలు.. ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఎక్కడ..

ధనిక రాష్ట్రం అని మీరు చెప్పిన తెలంగాణ లో గత
8 యేండ్ల లో 4లక్షల 86 వేల కోట్లు అప్పు చేసింది మీరు కాదా.. ఆ అప్పు లో ఎన్ని వేల కోట్లు మీకుతుంబానికి వచ్చాయి అని మళ్లీ మిమ్మల్ని గెలిపించాలని అడుగుతున్నారా..

దళితుడిని ముఖ్య మంత్రి చేశారు కాబట్టే మీకు మళ్లీ గెలిపించాలని అడుగుతున్నారా..

రైతు రుణ మాఫీ చేశారు కాబట్టి మళ్లీ మూడో సారి గెలిపించాలని అడుగుతున్నారా..

దళితులకు మూడు ఎకరాలు ఇచ్చారు కాబట్టి , మూడోసారి మిమ్మల్ని గెలిపించాలని అడుగుతున్నారా

ఎన్ని కుటుంబాలకు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని గెలిపించాలని అడుగుతున్నారా..

ఎన్ని కుటుంబాలకు, ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అని మూడోసారి గెలిపించాలని అడుగుతున్నారా..

Tspsc ద్వారా ఎగ్జామ్ కోసం పేదలు కడుపులు మడ్చుకొని పిల్లలని కోచింగ్ కి పంపిస్తే.. పేపర్ లీక్ చేసి వాళ్ల భవిష్యత్ ను దెబ్బతీసి నందుకి మిమ్మల్ని గెలిపించాలని అడుగుతున్నారా..

ఈ రాత్రంతా చెప్పినా ఈ ముఖ్య మంత్రి చెప్పిన వాగ్ధానాలు నెరవేర్చ లేదు అని తెలుస్తుంది..

మైనార్టీ లకూ 12 శాతం రిజర్వేషన్ కోసం తీర్మాన చేసి పంపిస్తే .. మీ పని అయిపోయింది అని మూడోసారి గెలిపించాలని అడుగుతున్నారా..

ఎదో ఒక కేసులో మీ బిడ్డను రక్షించడానికి సుప్రీం కోర్టు లో లాయర్ లని పేటించడానికి మీకు డబ్బు ఉంది కానీ మైనార్టీ లకు రిజర్వేషన్ ల కోసం సుప్రీం కోర్టులో కేసు వేసేందుకు పైసలు లేవా..

సింగరేణి కార్మికులు బోర్డర్ లో ఉన్న సైనికులతో సమానం అని కెసిఆర్ చెప్పారు కానీ అది మాటలకే పరిమితం.. గడిచినా 8 ఎండ్లలో 123 మంది గనుల్లో చనిపోయారు.. చనిపోయిన ఏ కుటుంబాన్ని అయినా సీఎం పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా..

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్, చంద్రబాబు కూడా చనిపోయిన సింగరేణి కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. ఇప్పటి ముఖ్య మంత్రి కి మాత్రం సమయం లేదు..

తెలంగాణ ఏర్పడే సమయంలో సింగరేణి దగ్గర ఉన్న డిపాజిట్ లు 3525 కోట్లు.. మొన్న మార్చి తో ముగిసిన సమయానికి సింగరేణి కి ఉన్న అప్పు 8 వేల కోట్లు.. లాభాల్లో ఉన్న సింగరేణి నీ నష్టాల పాలు చేసింది మీరు కాదా.. డబ్బు ఎక్కడ ఉన్నా, దాని కొల్లగొట్టడం ప్రభుత్వ లక్ష్యం..

Btps, ktps లో కార్మికులకు prc ఇవ్వక నాలుగేండ్లు.

మాటలతో మభ్య పెట్టడం కెసిఆర్ కి అలవాటు..

ముఖ్యమంత్రి గారు.. మీరు ఇబ్బంది పెట్టిన ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి ఏకం అవుతారు..

దానికి బీజం ఈరోజు మొదలైంది అందరూ కలుస్తారు.. మీరు చేసిన పనులకి ఫలితం అనుభవిస్తారు..

3,281 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?