
కేంద్రమంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు. తృటిలో తప్పించుకున్న కిరణ్ రిజిజు
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతని కారును ట్రక్కు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తృటిలో తప్పించుకున్నాడు.
ఈ ఘటన జమ్మూలోని బనిహాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
తన బుల్లెట్ ప్రూఫ్ కారులో కిరణ్ రిజిజు శ్రీనగర్ వెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది. లా మినిస్టర్ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో న్యాయమంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు.
దీంతో పాటు కారులో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. అయితే కారుకు కొంత నష్టం వాటిల్లింది.
ఈ ప్రమాదంలో కిరణ్ రిజిజు క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. అయితే అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు.
అంతకుముందు.. మంత్రి జమ్మూ నుండి ఉధంపూర్ వరకు న్యాయ సేవల శిబిరానికి హాజరవుతున్నప్పుడు ‘ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’ అని ట్వీట్ చేశారు.