ఆర్టీవో కార్యాలయం వద్ద భారీ పేలుడు.. ముక్కలైన శరీరం

Spread the love

అనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద భారీ పేలుడు.. ముక్కలైన శరీరం

ఆనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఆర్టీవో కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

శ్రీ బాలాజీ స్టిక్కర్స్ ప్రేయర్స్ దుకాణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం నాటి పెయింట్ డబ్బాలు ఓపెన్ చేస్తూండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో సతీష్ అనే వాచ్ మెన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

పేలుడు ధాటికి ఆ వ్యక్తి శరీరం ముక్కలైపోయింది. శరీర భాగాలు 30 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాయి. దీంతో సంఘటనా స్థలంలో పూర్తిగా భయానక వాతావరణం నెలకొంది.

చాలా ఏళ్ల క్రితం నిలువ ఉంచిన డబ్బాలను ఓపెన్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

5,404 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?