
భార్య ఆత్మహత్య చేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్సై
జనగామలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న భార్య.. కొంతసేపటికే రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్‌ఐ..
జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య చనిపోయిందన్న మనస్థాపంతో ఓ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాలు.. శ్రీనివాస్ అనే వ్యక్తి ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.
శ్రీనివాస్ భార్య స్వరూప ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న పలువురు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. భార్య స్వరూప మృతి నేపథ్యంలో శ్రీనివాస్ కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్.. తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే కుటుంబ కలహాల కారణంగానే శ్రీనివాస్ భార్య స్వరూప ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. రెండు రోజులుగా శ్రీనివాస్-స్వరూప దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్వరూప ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం.
అయితే భార్యను వేధింపులకు గురిచేశాననే నింద మోయాల్సి వస్తుందని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుల ఉన్నతాధికారులు శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
శ్రీనివాస్ సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్, స్వరూపల మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.