బీజేపీ నాయకుల వరుస అరెస్టులు

Spread the love

ఫ్లాష్…ఫ్లాష్..

• బండి సంజయ్ అరెస్ట్ వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పై పోలీసుల దాష్టీకం.

• రఘునందన్ ను చొక్కా పట్టి బలవంతంగా లాగి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లిన మఫ్టీలోనున్న పోలీసులు

• తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలన్న రఘునందన్

• పోలీసులు, రఘునందన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం

• మఫ్టీలో ఉంటూ మెడపై చేయి లాగుతూ దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ రఘునందన్ తీవ్ర ఆగ్రహం

• ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నట్లు చెబుతున్న పోలీసులు

• అరెస్ట్ ప్రొసీజర్ ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్న రఘునందన్

• బండి సంజయ్ అరెస్ట్ విషయంలో డీసీపీని కలిసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపాటు

• మీడియాతో మాట్లాడాక తాను పూర్తిగా పోలీసులకు సహకరిస్తానంటూ చెబుతున్నా వినకుండా బలవంతంగా రఘునందన్ ను పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు

• తన వద్ద తుపాకీ ఉందని… మీ చేష్టల వల్ల మిస్ ఫైర్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నా వినకుండా రఘునందన్ ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తరలించిన పోలీసులు

• మహిళా మోర్చా నేతలపైనా దురుసుగా వ్యవహరిస్తున్న పోలీసులు

• మహిళలని చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తారా? అంటూ మహిళా మోర్చా రాష్ట్ అధ్యక్షురాలు గీతామూర్తి ఆగ్రహం

• కేసీఆర్ డౌన్ డౌన్… పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలు

పత్రికా ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ ఎప్పుడో అయ్యింది. నిన్న రాత్రి మళ్ళా అదే రుజువైంది.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని ఎటువంటి నోటీసు, వారెంటు లేకుండా పోలీసులతో అరెస్టు చేయించి, ప్రశ్నించిన ప్రతీసారీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించుకుంది.

టెర్రరిస్టులను, నక్సలైట్లను అరెస్టు చేసినట్టు ఒక పార్లమెంటు సభ్యుడిని, జాతీయ పార్టీ అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని ఎటువంటి కారణం చెప్పకుండా అరెస్టు చెయ్యడం అత్యంత హేయమైన చర్య. బహుశా ఇది తెలంగాణ పోలీసుల కోసం రాసిన కొత్త పీనల్ కోడ్ ఏమో అనిపిస్తుంది.

అసలు ఈ అరెస్టు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్న.? టి.ఎస్.పి.ఎస్.సి. పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనప్పుడు ప్రశ్నించినందుకా? లేకపోతే నిన్న మొన్న పదో తరగతి బోర్డ్ పరీక్షల తెలుగు పేపర్, ఆ తర్వాతి రోజు హిందీ పేపర్ లేకైతే ప్రశ్నించినందుకా? వరుసగా ఒక్కొక్క పరీక్ష పేపర్ ప్రభుత్వ అసమర్థ, అన్యాయ, అక్రమ పాలనలో లీకైతుంటే ఆగమైతున్న విద్యార్థుల పక్షాన ప్రశ్నించి నిలిచినందుకా? లేకుంటే…నిన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సదివిన ఎం.ఎస్.సి. పొలిటికల్ సైన్స్ డిగ్రీ ని సూపెట్టమని అడిగినందుకా? అని….తెలంగాణ ప్రజలు అడుగుతున్నరు. వినాశకాలే విపరీత బుద్ధి అని నిరూపితమైందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

ఇప్పటికైనా నీ నియంత విధానాలను విడనాడి వెంటనే శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ నలుమూలల ప్రజల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న అవినీతి పాలన మీద భారతీయ జనతా పార్టీ పోరాటం మరింత ఉదృతం చేస్తామని కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

2,633 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?