
నారాయణ స్కూల్ వాచ్‌మన్ పైశాచికం
విశాఖపట్నం: ఓ ప్రైవేట్ పాఠశాల వాచ్‌మన్ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే… కూర్మన్నపాలెం నారాయణ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం తోటి స్నేహితులతో ఆడుకుంటూ వేచి ఉంది.
అదే స్కూల్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన అలకోటి పోచన్న (48) బాలికను మాయమాటలతో స్కూల్‌లో ఉన్న బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు.
బాలిక గట్టిగా అరవడంతో వాచ్‌మన్ అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించారు.
బాలిక శరీరంపై గాయాలు ఉండడంతో కోపోద్రోక్తులైన బాలిక తల్లిదండ్రులు వాచ్‌మన్‌ను పట్టుకునేందుకు ప్రయతి్నంచారు. కానీ అప్పటికే స్కూల్ మూసివేయడం, తరువాతి రోజు ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో అతడు దొరకలేదు.
సోమవారం స్కూల్ తెరిచిన వెంటనే వాచ్‌మన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు స్కూల్ వెనుక ప్రాంతంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.