
BREAKING: RR: 10th ప్రశ్నాపత్రం లీక్ చేసిన వ్యక్తి ఇతనే?
VKB జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు పేపరు లీక్ చేశారని అనుమానిస్తూ ప్రభుత్వ పాఠశాల-1 సైన్స్ టీచర్ బందెప్పను పోలీస్ అధికారులు ఈరోజు విచారిస్తున్నారు. గతంలో ఈయనపై ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని కేసు కూడా ఉంది.
బందెప్ప ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ లో పొందుపరచుకొని ఇతరులకు షేర్ చేసేటప్పుడు అనుకోకుండా వాట్సప్ గ్రూపులోకి వెళ్లిపోవడంతో ఈ విషయం బహిర్గతమైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూర్
ఎంతో పకడ్బందీగా నిర్వహించవలసిన పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్ వికారాబాద్ జిల్లా తాండూర్ వాట్సాప్ సోషల్ మీడియా గ్రూపులలో
ముందే చెక్కర్లు కొట్టింది ఉదయం 9:37కే వాట్సాప్ గ్రూప్ లలో వచ్చింది. ఈ విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చిన పేపర్ మనది కాదని బుకాయించారు
మరోవైపు పరీక్ష సమయం అయిపోయిన తర్వాత 12 గంటల 30 నిమిషాలకు బయటకు వచ్చిన విద్యార్థుల దగ్గర పేపర్ చూడగా ఆ పేపర్ ఈ పేపర్ ఒకటే విధంగా ఉన్నట్టుగా తెలిసింది.
దీంతో ముందుగానే పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని వెలుగులోకి రావడం జరిగింది…లీక్ చేసింది బంద్యప్ప అనే ప్రభుత్వ సైన్స్ టీచర్ అని ప్రాథమిక సమాచారం…
తెలంగాణలో ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
అధికార భారత్ రాష్ట్ర సమితిని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోన్నాయి. దీనిపై దర్యాప్తు జరిపించడానికి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు. ఇందులో టీఎస్‌పీఎస్సీ బోర్డ్ సభ్యులను కూడా సిట్ విచారించింది.
ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా పదో తరగతి పరీక్ష ప్రశ్రాపత్రం కూడా లీక్ కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఉదయం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సప్‌లల్లో చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. ఏడు నిమిషాల్లోపే ఈ ప్రశ్నాపత్రం వాట్సప్‌ల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ పేపర్ లీక్ చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బందెప్ప మొబైల్ ఫోన్ నుంచి ఈ పేపర్ లీక్ అయినట్లు అధికారులు నిర్ధారించారు. బందెప్పతో పాటు తాండూరు మండల విద్యాశాఖాధికారి వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తోన్నారు. ప్రశ్నాపత్రం లీక్ కాలేదంటూ వికారాబాద్ డీఈఓ వివరణ ఇస్తోన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రశ్నాపత్రం.. విద్యార్థులకు ఇచ్చినది రెండూ ఒక్కటేనని పోలీసులు తేల్చారు. దీనిపై పోలీసులు బందెప్ప, వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గకముందే ఇప్పుడు మళ్లీ ఎస్‌ఎస్సీ పరీక్ష పత్రం కూడా లీక్ కావడం విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు సైతం దీనిపై మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. అటు ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించింది. సమగ్ర నివేదిక అందజేయాలంటూ వికారాబాద్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.