
సత్తుపల్లి సింగరేణిలో ఉద్రికత్త
ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణిలోని రైల్వే భోగిలలో బొగ్గు నింపే సమయాలలో యాష్ వెలువడి మా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని సోమవారం బొగ్గు నింపే కార్యక్రమాన్ని సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఈక్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
తమకు శాశ్వత పరిష్కారం కావాలని గ్రామస్తులు డిమాండ్ చేసారు. పోలీసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు.
1,997 Views