
పెప్పర్ స్ప్రే చల్లి.. కత్తితో కానిస్టేబుల్ దాడి
చోడవరం గవరవరంలో భూముల సరిహద్దు విషయమై తహసీల్దారు తిరుమలబాబు సమక్షంలో ఇరువర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం..
గవరవరం రెవెన్యూ గ్రామ పరిధిలో జి.జగన్నాథపురం వెళ్లే దారిలో సర్పంచి చప్పగడ్డి మాణిక్యం కుమార్తె జొన్నపల్లి చిన్నతల్లికి చెందిన సుమారు 45 సెంట్లు భూమి ఉంది. ఏఆర్ కానిస్టేబుల్ వంకల అప్పలనాయుడు
ఈమె భూమిలోకి చొచ్చుకొని వచ్చి పెన్షింగ్ వేశారనే ఫిర్యాదుతో తహసీల్దారు తిరుమలబాబు, వీఆర్వో రమణమూర్తి, సిబ్బంది వెళ్లి ఇరువర్గాలను విచారణ చేశారు.
రెవెన్యూ సిబ్బంది భూమి వివరాలు అడుగుతున్న సమయంలో కానిస్టేబుల్ పెప్పర్ స్ప్రే చల్లి చేతిలో ఉన్న చిన్నపాటి కత్తితో అందివచ్చిన వారినల్లా గాయపరిచి హల్‌చల్ చేశారు.
దీంతో ఇరువర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. దీనిపై ఇరువర్గాలకు చెందిన 17 మందిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
చప్పగడ్డి దేముడునాయుడు ఫిర్యాదు మేరకు వంకల అప్పలనాయుడు, ఉప్పల అప్పారావు, లక్ష్మణ, నాగరాజు, బాలిబోయిన వెంకటరత్నంపై కేసు నమోదు చేయగా,
వంకల అప్పలనాయుడు ఫిర్యాదు మేరకు చప్పగడ్డి అర్జున్, చప్పగడ్డ అప్పలనాయుడు, దేముళ్లునాయుడు, జొన్నపల్లి వెంకటరమణ, మజ్జి రమణ, ఎరుకునాయుడు, అప్పలస్వామి తదితర 12 మందిపై కేసు నమోదు చేశామన్నారు.