
ఎమ్మెల్సీ కవిత పర్యటన వేళ టెన్షన్..టెన్షన్..వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
ఇటీవల హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవగా..ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.
నిన్న నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ఫ్లెక్సీలు వెలవగా..
ఒక్కరోజు వ్యవధిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు, ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా జగిత్యాలలోని మెట్ పల్లి ప్రధాన కూడళ్లపై పోస్టర్లు వెలవడం కలకలం రేపుతోంది.
అది కూడా జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్బంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫ్లెక్సీలలో ‘నిరుపేదలకు కేసీఆర్ ఇచ్చిన 120 గజాల డబుల్ బెడ్ రూం ఇళ్లు’ అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు
అలాగే ‘500 కోట్లతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన NRI కిసాన్ సెల్..సీఎం గారు మాట ఇస్తే తల నరుక్కుంటాడు గాని మాట తప్పడని’ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్ లో పేర్కొన్నారు.
ఇక ‘చెప్పినట్టు 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించి మా నాన్న అన్నలతో సెల్ఫీ’..అని కవిత చేబుతున్నటు పేర్కొన్నారు.