
లిక్కర్ స్కాములో కొత్తకోణం బి ఆర్ యస్ కు 75కోట్లు ఇచ్చా
మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తీహార్ జైలు నుంచి ఓ లేఖ విడుదల చేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్, సత్యేంద్ర జైన్ చెప్పినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కు రూ.75 కోట్లు ఇచ్చానని సంచలన ఆరోపణలు చేశాడు.
రూ.15 కోట్ల చొప్పున ఐదు సార్లు రూ. 75 కోట్లు కేసీఆర్ కు అప్పజెప్పానని చెప్పాడు. ఈ 75 కోట్లలో రూ.15 కోట్లు బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఓ రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు.
ఈ వ్యవహారానికి సంబంధించి కేజీవాల్ తో చేసిన 700 పేజీల వాట్సాప్ చాట్ తన వద్ద ఉందని పేర్కొన్నాడు. కేజ్రివాల్ అవినీతి అక్రమాలకు ఇది టీజర్ మాత్రనేనని, వారం రోజుల్లో అన్ని బయటపెడతానని చెప్పాడు.
కాగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మొదటిసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు బయటకురావడం సంచనంగా మారింది.
కాగా కేసీఆర్ పై సుఖేశ్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. కేసీఆర్ ను అభాసుపాలు చేసేందుకే కుట్రలు పన్నారని, , కానీ వాటిని తిప్పికొడుతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.