
అశ్వారావుపేట లో ఫారెస్ట్ ఆఫీస్ పై దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామంలో శుక్రవారం గంగానమ్మ గుడి ధ్వజ స్థంభం కోసం తెచ్చిన కలపను ఫారెస్ట్ రేంజర్ తన సిబ్బందితో కలిసివచ్చి గురువారం రాత్రి గుడి వద్ద ఎవరూలేని సమయంలో ముక్కలుగా కోసి తీసుకెళ్లారని ఆగ్రహం చెందిన గ్రామస్థులు అశ్వారావుపేట ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు.
స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరిన హిందూ సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న అటవీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. మహిళలు సైతం ఫారెస్ట్కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి లోపలకి చొచ్చుకెళ్లారు.
ఆగ్రహంతో రగిలిపోయిన మహిళలు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
అసలు ఏ విధమైన అనుమతి లేకుండా అడవిలో విలువైన చెట్టుని నరికి తీసుకు వచ్చారని, అందువల్లనే కలప ని స్వాధీనం చేసుకుని డిపోకి తరలించామని అటవీ సిబ్బంది అంటున్నారు.
కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి లోపలకి చొచ్చుకెళ్లారు. ఆగ్రహంతో రగిలిపోయిన మహిళలు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
అసలు ఏ విధమైన అనుమతి లేకుండా అడవిలో విలువైన చెట్టుని నరికి తీసుకు వచ్చారని, అందువల్లనే కలప ని స్వాధీనం చేసుకుని డిపోకి తరలించామని అటవీ సిబ్బంది అంటున్నారు.