
శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి
శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విషాదం.. బావిలో పడ్డ 25 మంది భక్తులు
శ్రీరామనవమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని మహాదేవ్ మందిర్ లో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పైకప్పు కూలి 25 మంది భక్తులు బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆలయ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
8,420 Views