
రిపోర్టర్ పై చీటింగ్ కేసు నమోదు
హైదరాబాద్: సుమన్ టీవీ రిపోర్టర్ పై చీటింగ్ కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ పూజ కార్యక్రమాలకు కవరేజ్ చేస్తామని చెప్పి రాజమహేంద్రవరం రిపోర్టర్ మోహన దుర్గా ప్రసాద్ 7 లక్షల రూపాయలు కాజేశాడు.
సుమన్ టీవీకి చెందిన నకిలీ రబ్బర్ స్టాంప్ తయారుచేసి 7 లక్షల రిసిప్ట్ ని ఆలయ అధికారులకు అందజేశాడు. చీటింగ్ గురించి తెలుసుకున్న సుమన్ టీవీ యాజమాన్యం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
దీంతో మోహన దుర్గా ప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 420, 406, 467, 471ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
6,493 Views