
బొగ్గుబావుల అమ్మకం దేశానికి ముప్పు.
స్వదేశీ బొగ్గును సమాధి చేసి విదేశీ బొగ్గు దిగుమతి అదాని కోసమే
జేబిసిసిఐ వేతనాలు, సౌకర్యాలు కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలి.
ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జి. అనురాధ.
Pbc న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గొప్పచరిత్ర గలిగిన సింగరేణిలో బొగ్గుగనులను అమ్ముకోవడం సిగ్గుచేటని,1లక్ష 16 వేలమంది కార్మికులు,లాభాలతో నడుస్తున్న సింగరేణి కంపెనీలో నేడు 42,000 మందికి తగ్గించి 35వేల మంది కాంట్రాక్టు కార్మికులను వినియోగిస్తున్నారని పాలకులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జి.అనురాధ, ఎస్.సి.సి.డబ్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.రాసుద్దిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక పర్మినెంటు కార్మికు డి స్థానంలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులను పెట్టి కనీస వేతనాలు, చట్టబద్ద సౌకర్యాలు అమలు చేయకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని వారు అన్నారు.కాంట్రాక్టు కార్మికులకు జేబిసిసిఐ వర్తింప చేయాలని సమరశిల పోరాటాలకు సిద్ధం కావాలని వారుపిలుపునిచ్చారు.
భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 2, 3లలో కొత్తగూడెంలో నిర్వహిస్తున్నందున సభల ప్రచారంలో భాగంగా మణుగూరు లో సోలార్ పవర్ ప్లాంట్, బoగ్లోశ్, దుర్గా కంపెనీ, సివిల్ డిపార్ట్మెంట్ లో ప్రచార సభలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనురాధ,రాసుద్దిన్ ప్రసంగిస్తూ సింగరేణి కేంద్రంలో నిర్వహించ బడుతున్న ఇఫ్టు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
2న వేలాది మంది కార్మికులతో మహా ప్రదర్శన ఉంటుందని అనంతరం కొత్తగూడెం క్లబ్ లో బహిరంగసభ నిర్వహించబడుతుందని ఈ సభలో ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు,ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ,విప్లవ కార్మిక నాయకులు అమితాబ్ (బెంగాల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఆరెల్లి కృష్ణ,ఎం. శ్రీనివాసు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు.
*సోమవారం ప్రతినిధుల సభ ఉర్దూగర్లో ఉంటుందని ఈ సభలో వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, ఐ.ఎఫ్ టి.యు జాతీయ అధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు,వివిధ రాష్ట్రాల విప్లవ కార్మిక నాయకుల ప్రసంగాలు ఉంటాయని అనురాధ వివరించారు.
ఈ సభలకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సింగరేణి,ఆర్టీసీ,భవన నిర్మాణ, నవభారత్,కెటిపిఎస్,హెవీవాటర్ ప్లాంటు,అసంఘటిత రంగ కార్మికులకు అనురాధ విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మంగిలాల్, కాంతారావు,శ్రీనివాసరావు,దేవేందర్ ప్రేమ్ కుమార్,మనోజ్ చంద్రo,సత్యనారాయణ, సుబ్బారావు,వేణు, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.