
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అజ్మీర రాములు
తిరుమలాయపాలెం : అప్పుల బాధలు తాళలేక గడ్డి మందు తాగిన ఓ రైతు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన అజ్మీర రాములు అనే వ్యక్తి తనకున్న మూడెకరాల భూమిలో రెండెకరాలు మిరప, మరో ఎకరంలో పత్తిని సాగు చేశాడు.
సుమారు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టారు. దిగుబడి మాత్రం రాలేదు.
దీంతో రూ.2 లక్షలకుపైగా అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన రాములు ఈనెల 25న ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డిమందు తాగాడు.
విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. మృతుడు రాములుకు భార్య రమాదేవి, ఓ పాప, ఓ బాబు ఉన్నారు.
మిగిలిన విషయాలు తెలియాల్సి వుంది
3,522 Views