
మంత్రికి తప్పిన ప్రమాదం
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
వెబ్‌డెస్క్: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం విశాఖలోని ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది.
ఇది గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తం చేయడంతో మంత్రి ఆదిమూలపు సురేష్ టేకాఫ్ కాకుండానే దిగిపోయారు. ఇతర మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా, ఈ ఘటనలో మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు అంతా ఊపీరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది.
ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే వున్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు. G20 సదస్సుల్లో భాగంగా విశాఖలో మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి.
ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ ప్రారంభం అయింది. మారథాన్ ప్రారంభించారు మంత్రులు ఆదిమూలపు సురేష్,విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్.
ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్….నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు.
అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.