తహసీల్దార్‌ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం

Spread the love

తహసీల్దార్‌ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం

తన భూమిని కబ్జా చేసి రికార్డు మార్చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు కౌడిపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఒంటిపై డీజిల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన చిన్నంగారపు నాగరాజు తండ్రి దుర్గయ్యకు గ్రామ శివారులోని సర్వే సంఖ్య 496/2లో.. 1996లో ప్రభుత్వం 1.39 ఎకరాల అసైన్డ్‌ భూమి కేటాయించింది. దుర్గయ్య మూడు నెలల కిందట మరణించాడు.

వారసత్వం కింద ఆ భూమిని తన పేరిట మార్పించుకుందామని చూస్తే, అప్పటికే అది అదే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళల పేరిట మారినట్లు గుర్తించాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని నాగరాజు తహసీల్దారు, ఆర్డీఓ, పాలనాధికారి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.

స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం తల్లి ఎల్లమ్మతో కలిసి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చాడు. ఒక్కసారిగా ఒంటిపై డీజిల్‌ పోసుకోగా అప్రమత్తమైన సిబ్బంది అడ్డుకున్నారు.

ఏఎస్సై శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి వచ్చి నాగరాజును ఠాణాకు తరలించారు. ఎస్సై శివప్రసాద్‌రెడ్డి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

ఈ విషయమై ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ తారాబాయిని వివరణ కోరగా రికార్డుల్లో ఆ భూమి ముగ్గురు పేర్లపైన మారిందని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది

6,344 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?