
ఆటో డ్రైవర్ నిర్వాకం.. కుమార్తెతో సహా దూకేసిన మహిళ!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై ఓ క్యాబ్ డ్రైవర్ కారులోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ రెండు ఘటనలు దేశాన్ని కుదిపేసిన విషాదాలే. అయితే ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడినా.. మనుషుల్లో మార్పులు రాలేదు.
అయినప్పటికీ మహిళలపై వాహనాల్లో అఘాయిత్యాలు ఆగలేదు. నిన్నటి నిన్న హైదరాబాద్ లో ఓ రైడింగ్ యాప్ కు చెందిన బైక్ డ్రైవర్ ఓ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఇంకా మర్చిపోక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో ఘటన వెలుగు చూసింది.
అనారోగ్యంతో బాధపుడుతున్నకుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటో ఎక్కింది ఓ మహిళ. అయితే ఆటోను ఆసుపత్రి వద్ద డ్రైవర్ ఆపకుండా దారి మళ్లించాడు.
అయితే ఈ విషయాన్ని గమనించిన మహిళ.. ప్రశ్నించగా. అయినప్పటికీ ఆపలేదు. దీంతో భయాందోళనకు గురైన మహిళ.. కుమార్తెతో సహా ఆటోలో నుండి దూకేసింది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుడుపల్లి మండలంలో్ని కంచి బందానపల్లి గ్రామానికి చెందిన జనార్థన్, నాగవేణికి నాలుగేళ్ల కుమార్తె ఉంది.
కుమార్తె యజ్ఞ ప్రియ జ్వరంతో బాధపడుతుండటంతో కుప్పం ఏరియా ఆసుప్రతికి తీసుకెళ్లేందుకు గ్రామంలో ఆటో ఎక్కింది. అయితే ఆటో డ్రైవర్ ఆసుపత్రి వద్ద ఆపకుండా వాహనాన్ని దారి మళ్లించడంతో.. ఆమెకు అనుమానం వచ్చి అడిగింది.
ఎటు తీసుకు వెళుతున్నావని, తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని బతిమాలాడినప్పటికీ ఆటో డ్రైవర్ నీతో పని ఉందంటూ వేగంగా వాహనాన్ని నడపడంతో భయాందోళనకు గురైన నాగవేణి, తన కుమార్తెతో కలిసి ఆటోలో నుండి దూకేసింది.
ఈ ఘటనలో తల్లి, కుమార్తెలకు గాయాలయ్యాయి. అయితే వారు దూకేయడంతో ఆటో డ్రైవర్ వారిని అక్కడ వదిలేసి పరారయ్యాడు. స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించారు. వీరి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ను గోపీగా గుర్తించారు. బాధితురాలి నుండి వాంగూల్మాన్ని సేకరించారు నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నారు.