
అడవిని, అడవి బిడ్డలను, భద్రాచలాన్ని భద్రంగా కాపాడుకుందాం
“వెంటిలేటర్‌పై ప్రజాస్వామ్యం”
మార్చి 24, 2023న భద్రాచలం, ఖమ్మంజిల్లా కేంద్రాలలో..
తెలంగాణ ప్రజాతంత్రవాదుల సదస్సు
భద్రాచల రాముడికి గుడికట్టిన రామదాసును నాటి పాలకులు జైలుకు పంపితే, ఆ గుడిలో కొలువుదీరిన శ్రీరాముడిని నేటి పాలకులు తిరిగి వనవాసానికి పంపిస్తున్నారు. పోలవరం సాకుతో అడవిని, అడవి బిడ్డలను, భద్రాచలాన్ని ఆగం చేస్తున్నారు. తెలంగాణ నుంచి బలవంతంగా ఏడు మండలాలు ఆంధ్రలో విలీనం చేసి తీరని అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం 220 గ్రామాలను నిండా ముంచుతుంది. కేంద్ర నిధులు, జలకమిషన్ అనుమతులతో నిబంధనలకు విరుద్ధంగా పోలవంర ఎత్తు పెంచుతూ లక్షల మందిని నిర్వాసితులను చేస్తున్నారు.
పోలవరం ఎత్తును పెంచే చీకటి కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి తెలంగాణ గ్రామాలను ఆంధ్రాలో కలిపింది. తిలా పాలం తలా పిడికెడు అన్నట్టు ఏడు మండలాలను ముంచడంలో అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. జై శ్రీరామ్ అనేవారు రాముడి గుడిని ఎలా ముంచుతారు? ఆదివాసుల బతుకులను ఎలా నాశనం చేస్తారు? తెలంగాణ, ఆంధ్రా ప్రజల అభివృద్ధి నిరోదక ప్రాజెక్టును ఏ ఒక్క పార్టీ కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు? మన భద్రచలాన్ని, మన శ్రీరాముడిని నిండా ముంచుతున్న ప్రాజెక్టు గురించి చర్చిద్దాం రాండి.
మార్చి 24, 2023 (శుక్రవారం)న ఉదయం 10 గంటల నుంచి వీరభద్ర ఫంక్షన్ హాల్, కూనవరం రోడ్, భద్రాచలం.
సాయంత్రం 4 గంటల నుంచి శాంతి లాడ్జి, స్టేషన్ రోడ్, ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ ప్రజాతంత్ర వాదులు నిర్వహించే “వెంటిలేటర్‌పై ప్రజాస్వామ్యం” సదస్సును విజయవంతం చేయండి.
సదస్సులో వక్తలు:
పి. నిరూప్ (సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది)
పాశం యాదగిరి (సినియర్ జర్నలిస్ట్)
కరుణాకర్ దేశాయి (తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు)
అనంచిన్ని వెకటేశ్వరావు TJSS అధ్యక్షులు