
ప్యూన్ పోస్ట్ కొరకు అంతర్గత సింగరేణి ఉద్యోగులకు వ్రాత పరీక్ష.
PBC న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మార్చి 23,
మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ నందు వివిధ విభాగాలలో పని చేస్తూ ప్యూన్ చేయుటకు ఆసక్తి, అర్హత గల అంతర్గత ఉద్యోగుల కొరకు గురువారం నాడు పైలట్ కాలనీ ఎం వి టి సి కార్యలయం నందు వ్రాత పరీక్ష నిర్వహించడం జరిగినది.
ఎస్ ఓ టు జిఎం డి లలిత్ కుమార్, ఏరియా డిజిఎం(పర్సనల్) ఎస్. రమేశ్ కలిసి ముందుగా సీల్డ్ కవర్లో ఉన్న ప్రశ్నావళిని ఓపెన్ చేసి అభ్యర్ధులకు అందజేయడం, జరిగింది. రెండు పోస్టుల కోసం నలుగురు అభ్యర్థులు హాజరు కాగా వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఇద్దరు అభ్యర్ధులను ఎంపిక చేయడం జరిగింది.
పూర్తి పారదర్శకంగా జరిగిన ఇట్టి పరీక్ష ఫలితాలను గురువారం నోటిస్ బోర్డు ద్వారా తెలియ జేయడం జరిగింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఏరియాలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా ప్యూన్ ఉద్యోగంలో నియామకం చేపట్టడం జరుగుతుందని డిజిఎం (పర్సనల్), అధికార ప్రతినిధి ఎస్ రమేశ్ తెలియజేశారు.
ఈ పరీక్ష నిర్వహణకు ఎంవిటిసి మేనేజర్ లక్ష్మణ్ రావు , సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్ , శ్రీ రాజు, మరియు సీనియర్స్, అసిస్టెంట్,తదితరులు పాల్గొన్నారు.