
నేడు సిట్ విచారణకు హాజరుకానున్న రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌కు భారీగా తరలివస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యాలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ శ్రేణులను తరలించాలని పిలుపునిచ్చారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
హౌస్ అరెస్ట్ చేశారు. మల్లురవి, అద్దంకి దయాకర్, వీహెచ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ ఘటనకు మంత్రి కేటీఆర్ పరిధిలో ఉన్న ఐటీ శాఖే కారణం అని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.
నిన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైను కలిశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు.
మంత్రి కేటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్‌ను ప్రాసిక్యూట్ చేయాలంటూ గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు.
అంతేకాదు సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని కేసు దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్‌కి నోటీసులు జారీ చేసింది సిట్.
ఇదిలావుంటే. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే డొంక మొత్తం టీఎస్‌పీఎస్సీలోనే కదులుతోంది.
ఇప్పటికే ఇద్దరు ఇంటి దొంగలు అరెస్టైతే, ఇప్పుడు మరో ముగ్గుర్ని కటకటాల వెనక్కి నెట్టింది సిట్. అంతేకాదు, ఏకంగా 42మంది టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.
కేసు మొత్తం ఇంటి దొంగలే చుట్టే తిరుగుతోంది. ఒక్కొక్కరుగా దొంగలంతా బయటికొస్తున్నారు.టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల్లో 20మంది గ్రూప్-1 రాస్తే, అందులో 10మంది క్వాలిఫై కావడం, వాళ్లల్లో కొందరికి 100కి పై మార్కులు రావడం కొత్త అనుమానాలు రేపుతున్నాయ్.
ఈ 10మందిలో ముగ్గురు ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాగా, ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు. దాంతో, ముందు ఇంటి దొంగలపై ఫోకస్ పెట్టింది సిట్. గ్రూప్-1 ఎగ్జామ్ రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు పేపర్ లీకేజీతో సంబంధముందా..? లేదా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.