టీఎస్​పీఎస్సీలో ఖాళీ కుర్చీలు!

Spread the love

టీఎస్​పీఎస్సీలో ఖాళీ కుర్చీలు!

పోస్టుల భర్తీపై కమిసన్ విజ్ఞప్తులు పట్టించుకోని సర్కారు
రాష్ట్రంలో వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసే టీఎస్పీఎస్సీలోనే భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.

కమిషన్లో ఉండాల్సిన దానిలో సగం ముందే రెగ్యులర్ ఎంప్లాయిస్ కాగా, మిగతా వారంతా ఔట్ సోర్సింగ్ వారే. రిక్రూట్ మెంట్ పనులు, కాన్ఫిడెన్షియల్ వర్క, లీగల్ పనుల కోసం టీఎస్పీఎస్సీకి సుమారు 400 మంది వరకు ఉద్యోగులు అవసరం.

కానీ ప్రస్తుతం 165 మందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 డిసెంబర్ లో టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశారు. టీఎస్పీఎస్సీ కేడర్ విభజన సమయంలో తెలంగాణకు 128 మందిని అలాట్ చేశారు.

దీంట్లో అడిషనల్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, సెక్షన్ ఆఫీసర్ తదితర పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో వాటిని అప్ గ్రేడ్ చేశారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కేడర్ సామర్థ్యం 165 ఉండగా, వీరిలో రెగ్యులర్ ఎంప్లాయిస్ 83 మందే.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ తదితర 4వ తరగతి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా ఖాళీల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఘంటా చక్రపాణి టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా ఉన్న సమయంలో కమిషన్​లోని ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర సర్కారుకు పలుమార్లు లేఖలు రాశారు. కనీసం అదనంగా వంద పోస్టులనైనా శాంక్షన్ చేయాలని కోరారు.

65 పోస్టులు ఇచ్చేందుకు సర్కారు సుముఖంగా ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగినా.. ఆ ప్రాసెస్ అక్కడే ఆగిపోయింది. అయితే, టీఎస్​పీఎస్సీలో ఖాళీగా ఉన్న 29 పోస్టులను గ్రూప్-3 ద్వారా భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది.

తక్కువ మందితో తిప్పలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)లో రెండు వేల నుంచి నాలుగు వేల వరకూ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అక్కడ సుమారు 1,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఏటా 4 వేల వరకూ ఉద్యోగాలు భర్తీ చేసే టీఎస్​పీఎస్సీలో 200 మంది కూడా లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వం గతేడాది మార్చిలో ఏకంగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా 17 వేలకు పైగా పోస్టుల భర్తీకి 2022లో టీఎస్​పీఎస్సీ 26 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది కొరత వేధిస్తోందని అధికారులు చెప్తున్నారు.

వందలాది కేసులతో ఎక్కువ మందిని ఆ పనికోసమే కేటాయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫీసర్ కేడర్​లోని ఉద్యోగులతోపాటు చాలామంది ఎంప్లాయీస్​18 గంటలపాటు పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికైనా సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

4,882 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?