
మనస్తాపంతో ఔట్ సోర్సింగ్ వర్కర్ ఆత్మహత్యాయత్నం
ఖమ్మం మున్సిపాలిటీ కార్పోరేషన్ లో స్వీపర్ గా పని చేస్తున్న నాగరాణి ఆత్మ హత్యయత్నం చేసుకోవడం సంచలనంగా మారింది.
ఈ సంఘటనతో మున్సిపాలిటీలో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అన్న ఆరోపణలు నిజమయ్యాయి. స్వీపర్ గా పనిచేస్తున్న నాగరాణి తనకు తెలిసినవారికి S మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం రూ. 50 వేలు ఇప్పించింది.
ఈ డబ్బు తీసుకున్న జవాన్ ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో తిరిగిన డబ్బు ఇవ్వమని బాధిత వ్యక్తి నాగరాణిని ఒత్తిడి చేశారు.
దీంతో నాగరాణి డబ్బులు ఇచ్చిన జవాన్ ని తిరిగి డబ్బులు ఇవ్వమని అడగడంతో నాకు సంబంధం లేదు అని చెప్పి మున్సిపాలిటీకి పిలిపించి అందరి
ముందు అసభ్యంగా తిట్టి కాగితం రాపించుకొని బయటికి వెళ్లగొట్టారని నాగరాణి జడ్జి వాంగ్మూలం లో తెలిపింది.
మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ తో పాటు ఆ జవాన్ తనని అవమానపరిచి తిట్టారని వాపోయింది. ఆ అవమానం తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మ హత్యాయత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాధితురాలి వద్ద నుండి జిల్లా జడ్జి ఈ మేరకు వాంగ్మూలం తీసుకున్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాధితురాలి వద్ద నుండి జిల్లా జడ్జి ఈ మేరకు వాంగ్మూలం తీసుకున్నారు. దీనిపై కమిషనర్ ఆదర్శ్ సురభిని వివరణ కోరగా ఘటన తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.