ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య!

Spread the love

ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
సహజీవనానికి అడ్డొస్తున్నాడని..

కామ వాంఛ తీర్చుకోవడానికి కట్టుకున్నోడినే కడతేర్చారు..

సహజీవనానికి అడ్డొస్తున్నాడన్న కోపంతో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది.

ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తగూడెం ఒకటో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. సన్యాసిబస్తీకి చెందిన గాయపాక ప్రవీణ్‌కుమార్‌ (35) పెయింటర్‌. నాలుగేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన రేగాని లావణ్యతో వివాహమైంది.

కొద్దినెలల తర్వాత ఆమెకు స్థానికుడైన తంగళ్ల సుమంత్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి భర్త వారించాడు. అయినా వినలేదు. రెండేళ్ల క్రితం ప్రియుడితో కలిసి ఇంట్లోంచి ఎటో వెళ్లిపోయింది.

కొన్నాళ్లకు తిరిగొచ్చి బస్తీలోనే పక్క వీధిలో సహజీవనం సాగిస్తున్నారు. విడాకులివ్వకుండా వేరొకరితో భార్య ఉండటాన్ని ప్రవీణ్‌కుమార్‌ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలుమార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టించాడు.

అయినా తాను ప్రియుడితోనే ఉంటానంటూ లావణ్య తెగేసి చెప్పింది. ఈ విషయమై వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ప్రవీణ్‌కుమార్‌ భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారమిచ్చింది.

వారొచ్చి అతడిని ఇంటికి పంపించేశారు. ఆదివారం ఉదయం మళ్లీ రావడంతో కోపోద్రిక్తురాలైన లావణ్య భర్తను రోకలి బండతో కొట్టింది. ఆమె ప్రియుడు ఇనుప రాడ్డుతో చితకబాదాడు. స్పృహ కోల్పోయిన ప్రవీణ్‌కుమార్‌ను స్థానికులు జిల్లా సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు.

అతడు అక్కడ చికిత్సపొందుతూ గంట తర్వాత మృతిచెందాడు. చేతులు విరగడంతో పాటు శరీర లోపలి భాగాల్లో బాగా దెబ్బలు తగిలినట్లు వైద్యులు తెలిపారు. డీఎస్పీ రెహమాన్‌, ఇన్‌ఛార్జి సీఐ రాజు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
వివాహేతర సంబంధాలు మానవ బంధాలను మట్టు పెడుతున్నాయి. కామ వాంఛతో కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న వాడినే కడతేర్చేలా చేసింది.

తాత్కాలిక సుఖాలకు తలొగ్గి నాతిచరామి అన్న మాటను మరిచి నీతి తప్పుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సన్యాసి బస్తీలో ఇలాంటి సంఘటనే ఇప్పుడు కలకలం రేపుతోంది. సన్యాసి బస్తీలో ఉంటున్న ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో తరచూ భార్యాభర్తలు గొడవ పడుతుండేవారు.

దీంతో భార్య గత కొన్ని రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో మరో యువకుడితో సన్నిహితంగా మెలుగుతుందంటూ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ వ్యవహారం ఆ నోట ఈ నోట భర్త చెవిలో పడింది. ఈ విషయమై భర్త తన భార్యను నిలదీసేసరికి వారి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి.

ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి భార్య మరో యువకుడితో కలిసి గడ్డ పారతో భర్త నడుముపై మొదడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. కాళ్ళు, చేతులు విరిగేలా నాప రాళ్లతో విచక్షణా రహితంగా కొట్టినట్లు చివరి సారి తీసిన వీడియోలో బాధితుడు వాపోయాడు.

ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. స్థానిక మాజీ రౌడీషీటర్(రాజకీయ నాయకుడు) భార్య భర్తల మధ్య పంచాయతీ చేసి వ్యవహారాన్ని గతంలో సద్దుమనిగేలా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది.

కానీ స్థానిక రౌడీషీటర్ పెద్దమనిషి ముసుగులో ఆ వ్యక్తి భార్యను లోబరుచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. వీరి మధ్య వివాదాలను అదునుగా తీసుకున్న రాజకీయ నాయకుడు తన అనుచరులతో పాటు భార్య, ఆమె ప్రియుడితో కలిసి భర్తపై పది రోజుల క్రితం దాడికి పాల్పడినట్టు స్థానికులు వాపోతున్నారు.

శనివారం రాత్రి భార్య ప్రియుడితో కలిసి భర్తపై పాశవికంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో భర్త చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. పెద్దమనిషిగా వ్యవహరిస్తూ మృతుని భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, భర్త అడ్డు తొలగించుకోవడానికి మాజీ రౌడీ షీటర్, ప్రియుడితో కలిసి అనేక మార్లు ఆ వ్యక్తిపై దాడికి ప్రేరేపించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

భర్త మృతిపై పోలీసులు కేసు దర్యాప్తులో వేగం పెంచడంతో కేసు నుండి బయట పడేందుకు ఆ పెద్ద మనిషి అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నిజాలు తెలియాలి అంటే మృతుడి భార్య, మాజీ రౌడీ షీటర్(రాజకీయ నాయకుడి) కాల్ డేటా ఆధారంగా విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటికి వస్తాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

2,785 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?