గ్రూప్-1 పరీక్ష రద్దు

Spread the love

BIG BREAKING: గ్రూప్-1 పరీక్ష రద్దు

TS: రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం సృష్టిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది.

దీంతోపాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను సైతం రద్దు చేసింది. OCT 16న 503 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది.

3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. ఇందులో 1:50 నిష్పత్తిలో 25,150 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు.

రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం సృష్టిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. దీంతోపాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను సైతం రద్దు చేసింది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది జూన్‌ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఇటీవల అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పేపర్‌ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ లో పేపర్ లీకేజీ తర్వాత.. ఒక్కొక్కటిగా బండారం బయటపడుతుంది. ఒక్క పరీక్షే కాదు.. చాలా పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు సిట్ విచారణలో వెలుగు చూస్తుంది.

ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు రద్దు చేస్తూనే.. కొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఏయే పరీక్షలు రద్దు అయ్యాయి.. ఏ పరీక్షలు వాయిదా పడ్డాయి అనేది వివరంగా తెలుసుకుందాం..

జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ వాయిదా :

1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనవరి 10న నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. జూన్ లేదా జులైలో ఆ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండేది. అయితే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ ని వాయిదా వేశారు.

ఏఈ పరీక్షలకు 833 అభ్యర్థులు:

833 ఏఈ పోస్టులకు 50వేల మంది అప్లై చేస్తుకున్నారు. మార్చి 5, 2023 న జరిగిన ఈ పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానంతో ఏఈ పరీక్షను రద్దు చేశారు.

టౌన్ ప్లానింగ్ అప్లికెంట్లకు నిరాశ :

టౌన్ ప్లానింగ్ అప్లికేంట్లకు నిరాశే మిగిలింది. ఈ పరీక్షల కోసం అక్టోబర్ 13, 2022 దరకాస్తు మొదలయింది. 175 పోస్టుల భర్తీకి 55,000 మంది అప్లై చేశారు. అయితే ఈ ఎగ్జామ్ డేట్ ప్రకటించే లోపే పేపర్ లీక్ అయి, టౌన్ ప్లానింగ్ పరీక్షను రద్దు చేశారు.

ఎంవీఐ పరీక్షలు క్యాన్సిల్ :

ఎంవీఐ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ జనవరి 12 న వచ్చింది. ఈ జాబ్ లో 113 వేకెన్సీలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వల్ల ఈ పరీక్షను కూడా రద్దు చేశారు.

ఏఈఈ పరీక్ష రద్దు:

జనవరి 1,2023 న జరిగిన ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పరీక్ష జరగింది. 1540 పోస్టుల భర్తీకి 81,548 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

డీఏఓ పరీక్షలకు లక్షమంది అభ్యర్థులు:

డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 53 పోస్టుల భర్తీకి 1,06,253 మంది అభ్యర్థులు దరకాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 26,2023న జరిగింది.

7,275 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?