హైదరాబాద్ లో దారుణం.. 4 ఏళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం!

Spread the love

హైదరాబాద్ లో దారుణం.. 4 ఏళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం!

దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే జీవిస్తున్నామా లేక జంతువుల మధ్య బతుకుతున్నామా అనే అనుమానం కలుగుతోంది.
4 ఏళ్ల చిన్నారి నుంచి 50 ఏళ్ల మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.

అయితే ఈ ఘటనలు మరువకముందే హైదరాబాద్ లో మరో దారుణం వెలుగు చూసింది. 4 ఏళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు పాడు పనికి కాలు దువ్వాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ వెంకటయ్య (40) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా శంషాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రైవేట్ లేబర్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.

అయితే కార్మికులు అందరూ శంషాబాద్ లోని ఓ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరితో పాటు కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తులు కూడా నివాసం ఉంటున్నారు.

ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి వెంకయ్య పీకల దాక తాగి తాను నివాసం ఉండే చోటుకు వచ్చాడు.
ఈ క్రమంలోనే ఈ దుర్మార్గుడు వీరి గుడిసె పక్కల నివాసం ఉంటున్న ఓ 4 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు. ఎలాగైన ఆ చిన్నారిని అత్యాచారం చేయాలని అనుకున్నాడు.

ఇందులో భాగంగానే ఆ బాలికపై వెంకయ్య అత్యాచారం చేశాడు. ఆ బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆ చిన్నారి తల్లి పరుగు పరుగున వచ్చి ఆ రాక్షసుడి చెర నుంచి తన బిడ్డను కాపాడుకుంది. వెంటనే జరిగిన దారుణంపై ఆ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ దారుణానికి పాల్పడిన వెంకయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఈ దుండగుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

957 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?