
చెరువును తరిపిస్తున్న మధిర ట్యాంక్ బండ్ రోడ్డు..?
అకాల వర్షానికి పెద్ద ఎత్తున నీటిమడుగుల్లా మారిన ట్యాంక్ బండ్ నూతన రహదారి
ఇంజనీర్ లోపమా..?
కాంట్రాక్టర్ వైఫల్యం..?
అధికారులు నిర్లక్ష్యమా..?
కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయని అధికారులు …కాంట్రాక్టర్
పాత చెరువు కట్టనే తలపిస్తున్న కొత్త గా నిర్మించిన మధిర చెరువు కట్ట .
సిపిఐ జిల్లా నాయకులు బెజవాడ రవి బాబు
Pbc న్యూస్ ప్రతినిధి మధిర
ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ తిరుగుతున్న మధిర నుండి అంబారుపేట, నిదానపురం, మాటూరు, మాటూరు పేట,మర్లపాడు మరియు పలు గ్రామాల వారు ఈ రోడ్డు మార్గం ద్వారానే నిత్యం మధిర వస్తూపోతుంటారు. ఇన్ని రోజులు పడ్డ బాధలు ఇక తీరాయి అనుకున్న గ్రామాల ప్రజలకు ఆశలు అడ ఆశలుగానే మిగిలాయి.
దీనికి ఎవరు బాధ్యులు లబ్ధి పొందిన రాజకీయ నాయకుల, బాగుపడిన కాంట్రాక్టర్ల.
ఏంటి ఈ కర్మ అని వాపోతున్న గ్రామాల ప్రజలు, ఈ మధ్యకాలంలో ట్యాంక్బండ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కాంట్రాక్టర్, అధికారులను నాసిరకంగా పనులు ఉన్నాయని సరి చేయవలసిందిగా ఆదేశించినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఇలా వదిలేయడంతోనే ఈ అకాల వర్షానికి భాహారీ ఎత్తున రోడ్డుపై చేరిన వరద నీరు.
ఈ నాసిరక నిర్మాణాల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మధిరలో జరుగుతున్న కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షించి నాణ్యతగా నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఐ నాయకులు బెజవాడ రవి డిమాండ్ చేస్తున్నారు.