
కూసుమంచి : కొంత మంది ప్రజాప్రతినిధుల అరాచకాలకు అదుపు లేకుండా పోతోంది. భూ వివాదాలలో తల దూర్చిన ఓ నాయకుడి వల్ల అమాయక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ కాసాని సైదులు తన గ్రామ పంచాయతీలోని నేషనల్ హైవే పక్కన ఏడాదికి రెండు పంటలు పండే భూములను కారుచౌకగా దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాడని, పదవిని అడ్డుపెట్టుకొని కొంతమంది ప్రజా ప్రతినిధుల అండదండలతో బలవంతంగా భూమిని స్వాహా చేసేందుకు పూనుకున్నాడు.
గత మూడు సంవత్సరాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడని అదే గ్రామానికి చెందిన పోలెబోయిన ఉపేందర్ అనే వ్యక్తి బుధవారం తన ఫోన్ లో సెల్ఫీ వీడియో తీస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో లో తెలియజేసి పురుగు మందు తాగి ఆత్మ హత్య యత్నం చేశాడు.
కాగా ఈ వ్యక్తి 2012లో భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నాడు. 2017లో జాతీయ రహదారి మంజూరు అవ్వడంతో ఆ రహదారి ఉపేందర్ పొలం గుండా వెళ్లడంతో ఒక ఎకరం ఇరవై ఆరు కుంటలు హైవే కు పోగా మిగిలిన మూడు కుంటల భూమిలో ఇంటి కోసం చిన్న షెడ్డు నిర్మాణం చేపట్టాడు.
అది జీర్ణించుకోలేని స్థానిక సర్పంచ్ కాసాని సైదులు తనపై దౌర్జన్యం చేస్తున్నాడని, ఆ ఆ స్థలం తమది కాదని, అక్కడ దేవుడు గుడి నిర్మాణం చెప్పడతామని హుకుం జారీ చేస్తున్నాడని తెలిపాడు.
దాంతో ఉపేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు 108 సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పంచాయతీలో ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇక్కడ సర్పంచ్ అరాచకాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని
గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు