
5 ఏళ్ళు శృంగారంలో పాల్గొని.. రేప్ అంటే ఎలా? అమ్మాయికి హైకోర్టు సూటి ప్రశ్న?
ప్రస్తుతం సమాజంలో ప్రేమ, వివాహం, మోసం, అత్యాచారం ఈ పదాలు సర్వ సాధారణం అయిపోయాయి. చాలా మంది తమ కోరికలు తీర్చుకునేందుకు ప్రేమ అనే బంధాన్ని వాడుకుని తమ కోరికలు తీర్చుకుంటున్నారు.
అయితే పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అన్నీ సమర్పించుకుంటున్నారు. తీరా మోస పోయామని తెలుసుకుని కుమిలిపోతున్నారు. అయితే కొందరు మాత్రం తేరుకుని సదరు వ్యక్తిపై అత్యాచారం, చీటింగ్ కేసులు పెడుతున్నారు.
కానీ, అలాంటి వారికి కోర్టులు ఇచ్చే తీర్పులు కనువిప్పుగా మారుతున్నాయి. అందుకు ఇప్పుడు చెప్పుకోబోయే కేసే మంచి ఉదాహరణ అవుతుంది.
ఓ యువతి ప్రేమలో పడింది. ప్రేమించిన వ్యక్తిన నమ్మి తన సర్వస్వం సమర్పించుకుంది. తీరా పెళ్లి చేసుకోవడం కుదరదని తెలియజేయడంతో మోసపోయానని భావించింది. వెంటనే తన మాజీ ప్రియుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. అతనిపై అత్యాచారం కేసు పెట్టింది. అయితే మాజీ ప్రియుడిపై అత్యాచారం కేసు పెట్టడాన్ని కర్ణాటక కోర్టుతప్పుబట్టింది. నిందితుడిపై అత్యాచారం కేసును హైకోర్టు రద్దు చేసింది.
సమ్మతితో శృంగారంలో పాల్గొని తర్వాత అత్యాచారం అని కేసు పెట్టడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఎం నాగప్రసన్న కేసును రద్దు చేశారు. ఇక్కడ ఒకటి, రెండు సార్లు కాదు ఇరువురి సమ్మతితో ఐదేళ్లపాటు శారీరక సంబంధం కొనసాగిందని వ్యాఖ్యానించారు.
ఈ కేసు గురించి స్పందిస్తూ “మహిళ సమ్మతి లేకుండా శారీరక సంబంధం ఐదేళ్ల పాటు కొనసాగి ఉంటుందని చెప్పేందుకు ఆస్కారం లేదు. ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం నేరంగా మారాలంటే.. ఐపీసీ సెక్షన్ 375లో తీవ్రతను తగ్గిస్తోంది” అంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది.
375 ప్రకారం మహిళకు ఇష్టం లేకుండా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారం చేస్తే దానిని అత్యాచారంగా పరిగణిస్తారు. అందుకు సెక్షన్ 376 ప్రాకారం శిక్ష పడుతుంది. బెంగళూరు చెందిన సదరు వ్యక్తిపై 53వ నగర సివిల్, సెషన్స్ కోర్టులో చేపట్టిన చర్యలను హైకోర్టులో సవాలు చేశాడు.
కులాలు వేరు కావడం వల్లే ఐదేళ్లుగా ప్రేమించుకున్నా కూడా వివాహం చేసుకోలకపోయారని వివరించారు. ఈ కేసును కొట్టివేసినప్పటికీ ఐపీసీ సెక్షన్ 323 ప్రకారం దాడి, ఐపీసీ సెక్షన్ 506 ప్రకారం బెదిరింపు కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.