
ఎమ్మెల్యే రాజయ్యకు తప్పిన ప్రమాదం..
హఠాత్తుగా జనంపై తేనెటీగలు దాడి..
వరంగల్ జిల్లాలోని ఉప్పుగల్ బోనాల జాతరలో తేనెటీగలు దాడిచేయడంతో జనం హడలిపోయారు.
హఠాత్తుగా జనంపై తేనెటీగలు దాడిచేయడంతో బోనాల జాతరని సంబరంగా జరుపుకుంటున్న భక్తులు తలోదిక్కుకుపారిపోయారు.
ఈ ప్రమాదంలో నుంచి ఎమ్మెల్యే రాజయ్య తృటిలో తప్పించుకుని బయటపడ్డారు.
జిల్లాలోని ఉప్పుగల్ వద్ద బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య ఈ రోజు ఈ జాతరకు హాజరై బోనమెత్తుకున్నారు.
ఈ ప్రాంతంలో తేనెటీగలు అధికంగా ఉన్నాయి. దివిటీలను వెలిగించారు. దివిటీల పొగతో తేనేటీగలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. హఠాత్తుగా అక్కడున్నవారిపై దాడి చేశాయి.
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఎమ్మెల్యే రాజయ్యకు విషయం చెప్పడంతో రాజయ్య వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో రాజయ్యకు పెను ప్రమాదం తప్పింది.
తేనెటీగలు అక్కడున్న వారిని కుట్టిపెట్టాయి. దీంతో భక్తులు హడలిపోయారు.
తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు అటూ ఇటూ పరుగులు పెట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు దూరంగా పరుగులు తీసి, ప్రమాదం నుంచి బయటపడ్డారు.