
హాస్పిటల్ లో నగ్న వీడియో కలకలం.. యువకుడికి దేహశుద్ధి!
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. మహిళలు ఒంటరిగా పట్టపగలు బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ఆస్పత్రిలో మహిళ స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీసిన ఘటన కలకం రేపింది. మహిళలకు ఎక్కడా భద్రత లేదు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం అని మహిళా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కర్నూల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నంద్యాల జిల్లా నల్వకాల్వకు చెందిన ఏలియా అనే యువకుడి స్నేహితుడు అనారోగ్యంతో బాధపడుతూ కర్నూల్ లోని సర్వజన వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నాడు. తన స్నేహితుడిని చూసేందుకు ఏలియా ఆస్పత్రికి వచ్చాడు.
రోగి సహాయకురాలు స్నానాలగదిలో ఉన్న విషయం గమనించిన ఏలియా తన వక్రబుద్ది చాటుకున్నాడు. మెల్లిగా ఎవరూ చూడటం లేదని బాత్రూం గోడ ఎక్కి సెల్ ఫోన్ తో వీడియో తీశాడు. అది గమనించి ఆమె వెంటనే కేకలు వేయడంతో ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఆడవాళ్లు స్నానం చేస్తుండగా వీడియో తీస్తావా అంటూ చివాట్లు పెట్టి దేహశుద్ది చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఏలియాను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గతంలో ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తగా ఎన్నో జరిగాయి.. పోలీసులు ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
ఆ మద్య హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు మహిళ బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి వీడియో తీశాడు. దీనిని గుర్తించిన ఆ కేకలు వేయడంతో అఖిల్ అనే యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
బెంగుళూరు లో పాండిచ్చేరికి చెందిన నిరంజన్ అనే యువకుడు హెచ్ఎస్ఆర్ లే అవుట్ లో పేయింగ్ గెస్ట్ ఉంటూ మహిళలతో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఓ యువతి బాత్ రూమ్ లో రహస్యంగా కెమెరా అమర్చి నగ్నవీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియో యువతికి పంపి తనతో శృంగారంలో పాల్గొనాలని బెదిరించాడు.. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.