పోకిరీలకు ఎదురు చెప్పినందుకు మహిళను బట్టలూడదీసి, చితకబాది….

Spread the love

పోకిరీలకు ఎదురు చెప్పినందుకు మహిళను బట్టలూడదీసి, చితకబాది….

పోకిరీలను వారించినందుకు ఆగ్రాలో మహిళపై అఘాయిత్యం; పగబట్టి మరీ ప్రతీకార దాడి…

పోకిరీలను వారించినందుకు ఓ మహిళపై 11మంది వ్యక్తులు ప్రతీకార దాడి చేసిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది.

గతవారం తనని ఇబ్బంది పట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను సదరు మహిళ (30) వారించేందుకు ప్రయత్నించింది. ఆ ఘటన మనసులో పెట్టుకున్న యువకులు మరో తొమ్మిది మందిని తీసుకువచ్చి యువతి ఇంటిపై దాడి చేశారు. ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. అడ్డువచ్చిన కుటుంబ సభ్యులపైనా కూడా దాడి చేశారు.

ఈ మేరకు తాజ్ గంజ్ పోలీస్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని వారు బెదిరించినట్లు సదరు యువతి ఎఫ్.ఐ.ఆర్. లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.

బైక్ పైనే శృంగారం.. ఓ యువతి, ఇద్దరు యువకులు.. మధ్యలో కూర్చోబెట్టుకుని.. ఛీ ఛీ

వెబ్ డెస్క్ : కాలం మారిన కొద్ది యువతీయువకుల చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. వారి చేష్టలతో ఎవరికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ, చూసే వారికి మాత్రం మతి పోగొడుతున్నారు.

ఎవరైనా చూసి ఏమనుకుంటారో అన్న జంకు, బిడియం లేకుండా బరితెగిస్తున్నారు. ఆ మధ్య లక్నోలో ప్రేమజంట బైక్‌ పై చేసిన రొమాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో ఇప్పుడు మరో వీడియో అంతకన్నా ఎక్కువ పాపులర్ అయ్యింది.

ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలో హసన్‌పూర్‌ గజ్రౌలా రోడ్డులో ఓ ప్రేమజంట రన్నింగ్ బైక్‌ పైనే ముద్దు ముచ్చట కానిచ్చేశారు. ముందు వ్యక్తి బైక్ నడుపుతుంటే వెనక కూర్చున్న యువకుడు మధ్యలో ఉన్న యువతికి హగ్గులు ఇస్తూ, ముద్దులు పెడుతూ రొమాన్స్ చేశారు.

అది కాస్త రోడ్డుపై వెళ్తున్న వారి కంట పడింది. ఆ దృష్యాన్ని చూసిన జనాలు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. మరి కొంతమంది ఈ జంట బైక్‌ పై చేస్తున్న రొమాన్స్‌ని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

యువతి, యువకుడు చేసిన పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఆడవాళ్లు ఇంతలా బరితెగిస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన పోలీసులు ఆ ప్రేమజంటపై కేసునమోదు చేశారు.

పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్‌ చేసిన జంట ఎవరూ అంటూ ఆరా తీస్తున్నారు. వీడియోలో కనిపించిన ద్విచక్రవాహనం నెంబర్ ఆధారంగా వారికోసం అన్వేషిస్తున్నారు.

3,979 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?