
TSPSC పేపర్ లీక్ కేసులో కీలక మలుపు.. 13 మంది అరెస్ట్
రాష్ట్రంలో కలకలం రేపుతోన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీక్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడిగా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌ను ఈ కేసులో పోలీసులు చేర్చారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏగా అతడు పనిచేస్తున్నాడు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌ను కూడా అరెస్ట్ చేశారు.
నేడు మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టడంతో పాటు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించనున్నారు.
ప్రవీణ్‌కు పరిచయం ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కోసమే పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. అమెతో ప్రవీణ్‌కు పాత పరిచయం ఉన్నట్లు గుర్తించారు. ఆమె పలు మార్లు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ ఆఫీస్‌లొ ప్రవీణ్‌ను కలిసినట్లు తెలిసింది.
ఇదే క్రమంలో ఆమె చెప్పిన డీల్ కోసం ప్రవీణ్.. పేపర్‌ను లీక్ చేశారన్న వివరాలు పోలీసులు సేకరించారు. తన తమ్ముడి కోసం టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ క్వశ్చన్ పేపర్ కావాలంటూ ప్రవీణ్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది.
ఎలాగూ క్వశ్చన్ పేపర్ దొరుకుతుంది కాబట్టి.. పరీక్ష రాసేందుకు సిద్ధమైన అభ్యర్థి.. ఒక గ్రామ సర్పంచి కుమారుడితో బేరసారాలు నడిపింది.
నలుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసింది. ఇందులో రూ.10 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయం తెలిసిన ఓ అభ్యర్థి.. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు టీఎస్‌పీఎస్సీ అధికారులతో సంప్రదించగా.. పేపర్ లీకైన వ్యవహారం బయటపడింది.
ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కార్యదర్శి పీఏ ప్రవీణ్.. కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు.
అనంతరం పదోన్నతి లభించింది. గతంలో పనిచేసిన ప్రభుత్వ విభాగాన్ని మూసివేయడంతో టీఎస్పీఎస్సీకి వచ్చారు. నాలుగేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇటీవల టీఎస్‌పీఎస్సీ నుంచి పలు నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
నిందితులు ఈ పరీక్షా పత్రాలేనా.. లేక గతంలో జరిగిన సీడీపీఓ, సూపర్వైజర్ ఇతర పోస్టులకు పేపరు లీక్ చేశారా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ప్రవీణ్ ల్యాప్‌టాప్‌ను జప్తు చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు