
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అత్తను చంపిన అల్లుడు!
ఈ రోజుల్లో తాగుడుకు బానిసైన చాలా మంది వ్యక్తులు మద్యం మత్తులో ఎంతటి దారుణాలకైన తెగిస్తున్నారు. అంతేకాకుండా వావి వరసలు మరిచి హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు.
ఇక అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఏకంగా సొంత అత్తనే అల్లుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఏపీలోని విశాఖపట్నం ఆరిలోవ పరిధిలోని ప్రాంతం. ఇక్కడే ఉన్న హనుమంవాక కొండపై ఓ అల్లుడు అత్త నారాయణమ్మ (67)తో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. దీనికి నిరాకరించిన అత్త.. డబ్బులు లేవంటూ తెగేసి చెప్పింది.
ఇదే విషయంపై అత్త, అల్లుడు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన అల్లుడు.. అత్త నారాయణమ్మను గోడకేసి చితకబాదాడు.
అల్లుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న నారాయణమ్మ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అత్తను చంపిన అల్లుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.