
మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నా: రాజయ్య
TS: ఇటీవల వరకు జరిగిన పరిణామాలకు తాను చింతిస్తున్నానని MLA రాజయ్య అన్నారు.
‘తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నా. నా వల్ల మహిళల ఆత్మగౌరవానికి అన్యాయం జరిగి ఉంటే మన్నించాలి.
జానకీపూర్ అభివృద్ధికి నా వంతు కృషి చేసేందుకు ఇప్పుడే రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నా. ప్రవీణ్ ను చూసే సర్పంచి టికెట్ ఇచ్చాను. అప్పటివరకు నేను నవ్యను అసలే చూడలేదు’ అని రాజయ్య తెలిపారు.
2,955 Views