విద్యార్థినులపై హెడ్మాస్టర్ లైంగిక విధింపులు

Spread the love

ఒంటిపై పుట్టుమచ్చలు చూపించాలంటూ ఒత్తిడి.. విద్యార్థినులతో హెడ్ మాస్టర్ తప్పుడు పని..చివరి కి కటకటాల్లోకి

మంచీ చెడు నేర్పాల్సిన టీచర్‌…భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడు…కామపిశాచిగా మారాడు.

కన్నబిడ్డల్లాంటి బాలికలను టార్గెట్‌ చేసి, ముప్పతిప్పలు పెడుతుంటే మౌనంగా భరించారు…

కానీ కీచక ఉపాధ్యాయుడి అసలు రంగు బయటపడ్డానికి ఓ అవగాహనా సదస్సు ఉపయోగపడింది…ఎక్కడ ఎలా చూద్దాం..

సత్యసాయి జిల్లాలో ఓ ప్రధానో పాధ్యాయుడి కీచక పర్వం ఆసల్యంగా బయటపడింది. తనకల్లు మండలం నల్లగుట్లపల్లి జల్లాపరిషత్‌ ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ..పాఠశాలలో బాలికలకు గత కొద్దిరోజులుగా నరకం చూపిస్తున్నాడు.

ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులు…వికృత చేష్టలను భరిస్తూ.. చాలాకాలంగా విద్యార్థినులు తమలో తామే కుమిలిపోయారు. ప్రధానోపాధ్యాయుడి స్థానంలో ఉండి…. చివరకు జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ కూడా ఆదినారాయణ అమ్మాయిల పట్ల అరాచక చేష్టలకు పాల్పడ్డాడు.

ఒంటిపై పుట్టుమచ్చలు చూపించాలంటూ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తోంటే అమ్మాయిలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యారు. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా ఓ స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆదినారాయణ అఘాయిత్యాలు బయటపడ్డాయి.

పాఠశాలలో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయనీ, ప్రధానోపాధ్యాయుడు సహా మరికొందరిపై చర్యలు తప్పవన్నారు డీఈఓ మీనాక్షి. అక్కడ పనిచేస్తున్న మహిళా టీచర్లు సైతం ప్రధానోపాధ్యాయుడికి సహకరిస్తుండడం దారుణం అన్నారు.

ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ లైంగిక వేధింపులపై స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆదినారాయణను సస్పెండ్‌ చేశారు అధికారులు. సెక్షన్ 354(D), సెక్షన్ 7,8,11,12 ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

3,359 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?