యువ అధికారికి ….యువతి బ్లాక్ మెయిల్

Spread the love

యువ అధికారికి ….యువతి బ్లాక్ మెయిల్

త‌న న‌గ్న వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోల‌ను అధికారికి వాట్సాప్ చేస్తూ పెళ్లి చేసుకోకుంటే బజారుకీడుస్తా అంటూ ర‌చ్చ చేస్తున్న కిలేడీ క్రైం క‌థ ఇది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పనిచేస్తున్న ఓ అధికారికి అదే మండలంలోని కొప్పూరు గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా వెంటపడి వేధిస్తోంది. ఆమె వేధింపులపై గతంలో ముల్కనూరు పోలీసులు కౌన్సెలింగ్ చేయ‌డంతో అధికారికి వేధింపులు ఆగిపోయాయి.

అయితే గ‌త వారం రోజుల క్రితం నుంచి నెంబ‌ర్లు మార్చుతూ, కొత్త నెంబ‌ర్ల నుంచి న్యూడ్ కాల్స్‌, మార్ఫింగ్ ఫొటోలు పంపుతూ బెదిరింపుల‌కు పాల్పడుతున్నట్లుగా బాధితుడు ఆవేద‌న వ్యక్తం చేశాడు. సదరు యువతి వేధింపులకు ఓ అధికారి ఉద్యోగానికి తరుచు సెలవులు పెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.

తరచూ కార్యాలయానికి వచ్చి మనోవేదనకు గురిచేస్తుందని సదరు అధికారి సన్నిహితుల వద్ద తన గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండ‌గా స‌ద‌రు యువతి గ‌తంలోనూ హుజురాబాద్ పట్టణానికి చెందిన ఓ యువకుడిని ఇలానే ఇబ్బందుల‌కు గురి చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

read also :

మహిళా జడ్జీకే తప్పని వేధింపులు.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కానీ, మహిళా సాధికారత పక్కన పెడితే, కనీస రక్షణ కూడా లేకుండా పోతుంది.

సాధారణ మహిళలే కాదు, ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలకు మృగాళ్ల వేధింపులు తప్పటం లేదు. ఏకంగా ఒక మహిళ జడ్జీనే వేధించాడు ఓ దుండగుడు. మహిళా జడ్జి సోషల్ మీడియా ప్రొఫైల్ నుండి డౌన్‌లోడ్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసి కోర్టులోని ఆమె ఛాంబర్‌తో పాటు ఆమె నివాసానికి కూడా పంపాడు దుండగుడు. మహిళా జడ్జి ఫోటోలను మార్ఫింగ్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరించి రూ. 20 లక్షలు డిమాండ్ చేయటం బాధిత మహిళా జడ్జీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళా న్యాయమూర్తిని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, న్యాయమూర్తి ఫోటోలు ఆమె సోషల్ మీడియా ఖాతా నుండి డౌన్‌లోడ్ చేసినట్టుగా నిర్ధారించారు. ఆపై ఆమె ఫోటోలను ఎడిట్ చేసి కోర్టులోని ఆమె ఛాంబర్‌తో పాటు ఆమె నివాసానికి పంపారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 28న కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరి 7వ తేదీన తన స్టెనోగ్రాఫర్‌కు ఓ వ్యక్తి వచ్చి పార్సిల్ డెలివరీ అందించాడని, అది స్కూల్‌లోని తన పిల్లల నుంచి వచ్చిందని చెప్పాడని జడ్జీ పోలీసులకు చేసిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. అతని పేరు ఏమిటని స్టెనోగ్రాఫర్ అడగ్గానే అక్కడి నుంచి ఆ నిందితుడు వెళ్లిపోయాడని వివరించారు. ఆ పార్సిల్‌లో కొన్ని స్వీట్లు ఉన్నాయని, ఆ జడ్జీకి చెందిన మార్ఫింగ్ చేసిన ఫొటోలూ ఉన్నాయని తెలిపారు.

అలాగే, ఆ పార్సిల్ కవర్‌లో ఓ లెటర్ కూడా ఉన్నది. తనకు రూ. 20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని బెదిరింపు లేఖలు ఉన్నాయి.

రూ. 20 లక్ష లతో రెడీగా ఉండాలని, లేదంటే ఆమెను, ఆమె కుటుంబాన్ని స్పాయిల్ చేస్తానని బెదిరించినట్టు ఆ లేఖ పేర్కొంది. సమయం, స్థలాన్ని త్వరలోనే చెబుతానని తెలిపింది. ఇలాంటి వాటితోటే మరో పార్సిల్ వచ్చింది. ఇది 20 రోజుల తర్వాత ఆమె ఇంటికే వచ్చేసింది. అప్పుడు ఆ న్యాయమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోర్టు చాంబర్‌లో ఆమెకు డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు సీసీటీవీ కెమెరాలో 20 ఏళ్ల లోని వ్యక్తి కనిపించినట్టు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు మరింత ముమ్మరం చేశారు.

9,482 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?