
ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. జైలుకు పంపిస్తే ఏమీ చేయలేను!
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
లిక్కర్ స్కామ్‌లో తాను చేసింది ఏమీ లేదని, తాను దేనికీ భయపడబోనని ఆమె తెలిపారు.
”ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నేను చేసింది ఏం లేదు. విచారణకు పూర్తిగా సహకరిస్తా. నేను దేనికీ భయపడను. అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరికి వెళ్తా.. అంటూ ఆమె తెలిపారు. అలాగే.. ”లిక్కర్ నేను ఫోన్లు ధ్వంసం చేయలేదు.
అడిగితే ఫోన్లు కూడా ఇస్తా. గతంలో ఈ స్కామ్‌కు సంబంధించి ఆరు గంటలపాటు సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చా” అని ఆమె వివరించారు.
బీజేపీ టార్గెట్ తాను కాదని, కేసీఆర్ అని ఆమె తెలిపారు. జైలుకు పంపిస్తే తానేమీ చేయలేనని, ఇందులో తన పాత్రేమీ లేదని ఆమె మరోసారి స్పష్టం చేశారామె. ఇక నోటీసుల పరిణామంపై ఆమె సాయంత్రంలోగా మరోసారి మీడియా ముందుకు రావొచ్చని తెలుస్తోంది.
నోటీసులు అందాయి కానీ..
లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు తనకు అందాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నాకు నోటీసులు వచ్చాయి. చట్టాన్ని గౌరవిస్తా. దర్యాప్తునకు పూర్తి స్థౠయిలో సహకరిస్తా.
కానీ, ఢిల్లీలో 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా కారణంగా విచారణకు రేపు హాజరుకాలేను. ఈడీ ఎదుట హాజరుకు సమయం కోరతా.. అవసరమైన న్యాయ సలహా తీసుకుంటా అని ఆమె పేర్కొన్నారు.
పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో పేరు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని ఈడీ తాజాగా ఆమెను సమన్లు జారీ చేసింది. ఇందుకోసం ఢిల్లీకి రావాలని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మంగళవారం అరెస్ట్ చేసింది.
సౌత్ గ్రూప్‌నకు పిళ్లై ప్రతినిధి అని, కేవలం కవిత ప్రయోజనాల కోసమే పని చేశారని ఈడీ పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లోనూ పేర్కొంది.
తాజా పరిణామాల నేపథ్యంలో.. ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్ళే దారులు అన్ని మూసివేసి.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.