
కనికరించి పెట్రోల్ పోసిన పాపానికి.. నిండు ప్రాణం తీసిన యువకులు
రంగారెడ్డి: నార్సింగిలో దారుణ ఘటన జరిగింది. పెట్రోల్ పంప్ లో పని చేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ దాడిలో సంజయ్ అనే కార్మికుడు మృతి చెందగా..
మరోకరకి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 12 గంటలకు జన్వాడ లోని HP పెట్రోల్ పంప్ వద్దకు ఓ కారు వచ్చింది. సమయం అయిపోయిందని బంకును మూసివేసినట్ల కార్మికులు చెప్పారు.
అయితే, చాలా దూరం వెళ్లాలని కారులో వచ్చిన యువకులు బతిమాలడంతో కనికరించి కారులో పెట్రోల్ పోశారు.
అయితే, వారి కార్డు పని చేయక పోవడంతో క్యాష్ ఇవ్వమని బంకు క్యాషియర్ అడిగాడు. మాకే ఎదురు మాట్లాడుతారా అంటూ యువకులు రెచ్చిపోయిన. క్యాషియర్ చోటుపై దాడి చేశారు.
కొట్టకండి అంటూ సంజయ్ వారికి అడ్డుపడ్డాడు. అడ్డు వచ్చిన సంజయ్ పై కారులోని యువకులు పిడి గుద్దులు కురిపించారు.దీంతో స్పాట్ లోనే సంజయ్ కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
బంకు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులపై మర్డర్ కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు.. సీసీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాల ఆధారంగా విచారణ ప్రారంభించారు.
నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూప్ లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.