మద్యం మత్తులో నాగుపాముతో ఆటలు.. కాటు వేయడంతో మృతి

Spread the love

మద్యం మత్తులో నాగుపాముతో ఆటలు.. కాటు వేయడంతో మృతి

INTERNET DESC : పీకలదాకా మద్యం తాగిన ఓ యువకుడు మత్తులో నాగుపామును ముద్దాడాడు. దాన్ని మెడలో వేసుకుని విన్యాసాలు చేసాడు. పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన బిహార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాదా జిల్లాలోని గోవింద్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దిలీప్‌ యాదవ్‌ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు పూటుగా మద్యం తాగి..

పామును ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత సర్పాన్ని మెడలో వేసుకుని ఆలయం ముందు శిరస్సు వంచి దండాలు పెట్టాడు. తనను క్షమించమని దేవుడిని కోరాడు. ఆ తర్వాత మెడలో పాముతో కాసేపు చిందులేశాడు. కాసేపటికి తర్వాత పాము కాటువేయడంతో కిందపడిపోయాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

730 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?