మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

Spread the love

వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి.. భర్త పనే అంటూ తల్లిదండ్రుల ఆరోపణ

వరంగల్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భర్త చంపేసి.. ఆత్మహత్యగా సృష్టిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మహిళా కానిస్టేబుల్ మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతురాలు నిత్యం భర్త, అత్త వేధింపులకు గురయ్యేదని తోటి మహిళ కానిస్టేబుళ్లు వెల్లడించారు.

అనుమానాస్పద స్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి.. భర్త పనే అంటూ తల్లిదండ్రుల ఆరోపణ
తమ కూతురికి కానిస్టేబుల్ ప్రభుత్వ కొలువు రాగానే ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కష్టపడి చదివి పది మందిలో తలెత్తుకునేలా చేసిందని సంతోషించారు. ఇక బిడ్డకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తమ బరువు భాద్యతలు తీరుతాయనుకున్నారు.

అలా బంధువులను ఇతర చుట్టుపక్కల వాళ్లను కనుకుని తమకు తెలిసిన దగ్గరి బంధువుల కుమారునికి ఇచ్చి పెళ్లి చేశారు. తెలిసిన వారయితే తమ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటారనుకున్న ఆ తల్లిదండ్రులు.. వారే తమ బిడ్డ మరణానికి కారణమయ్యారని కన్నీరుమున్నీరవుతున్నారు. అత్తింటి వేధింపులు తాళలేక మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

మౌనిక, మృతురాలు
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం: వరంగల్ పట్టణంలోని వేణురావు కాలనీలో మౌనిక అనే మహిళ కానిస్టేబుల్ మహబూబాబాద్​ డీఎస్పీ కార్యాలయంలో రైటర్​గా పనిచేస్తుంది.2014వ బ్యాచ్​కు చెందిన మౌనికకు ఏడు సంవత్సరాల క్రితం దగ్గరి బంధువైన శ్రీధర్​కు ఇచ్చి వివాహం చేశారు.

అలా సాగుతున్న వారి వివాహ బంధానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు జన్మించారు. మొదట్లో ఆమె భర్త ఫైనాన్స్ నడుపుతాడు.. లక్షలు, లక్షలు సంపాదిస్తాడని చెప్పారు. పెళ్లయిన కొత్తలో బాగానే సంపాదించినా తర్వాత మద్యానికి బానిసైనాడు. తరచూ తాగొచ్చి భార్యతో గొడవకు దిగేవాడు.

తనను భర్త ఎంత వేధించినా ఆమె మాత్రం బయటకు చెప్పుకునేది కాదు. తల్లిదండ్రులకు చెప్పేది కాదు. ఎంత బాధించినా భర్తే కదా అని ఓర్చుకుంది. ఎప్పటికైనా మారుతాడనుకుంది. కానీ చివరకు కుటుంబకలహాలు భరించలేని ఆ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

స్నేహితులతో మౌనిక
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. మౌనిక మృతదేహంపై గాయాలు కనిపించడంతో భర్తే చంపేసి.. ఆత్మహత్యగా సృష్టిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మౌనిక మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఆమె తోటి మహిళ కానిస్టేబుళ్లు మౌనిక నిత్యం భర్త, అత్త వేధింపులకు గురయ్యేదని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకునేంత పిరికిరాలు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె భర్త, అత్తింటివారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రస్తుతం మహబూబాబాద్‌ డీఎస్పీ కార్యాలయంలో మౌనిక రైటర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. తమకంటే చాలా తెలివైనదని, ధైర్యవంతురాలని తోటి మహిళ కానిస్టేబుళ్లు పేర్కొన్నారు. మౌనిక గతంలో కాజీపేటలో పోలీస్ స్టేషన్​లో కూడా పనిచేసింది. ఆమె పని చేసిన ప్రతిచోట అందరితో కలుపుగోలుగా ఉండేదని మౌనిక తోటి సహోద్యోగులు పేర్కొన్నారు.

శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రి మౌనిక కుటుంబసభ్యులు, బంధువులు ఆర్తనాదాలతో నిండిపోయింది.

మౌనిక మృతికి అత్తింటి వారే కారణమని అక్కడకు చేరుకున్న ఆమె అత్తపై మౌనిక తల్లిదండ్రులు దాడికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మౌనిక అత్త, కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

4,460 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?