
గాల్లోకి ఎగిరి..20 అడుగుల దూరంలో పడి
నాగోలు : రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని అదుపుతప్పి వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు.
ఎల్బీనగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం… కుషాయిగూడ సమీపంలోని నాగారంలో నివసించే జైకుమార్(50) నాగోలులోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఉద్యోగి.
గురువారం మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో నాగోలులోని రామాలయం వద్ద నడుస్తూ సంస్థ కార్యాలయం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొంది.
బాధితుడు అమాంతం గాల్లోకి ఎగిరి 20 అడుగుల దూరంలో పడి గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులోని మహిళ సైతం అతని వెంట ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించారు. ప్రాణాపాయం లేదని సమాచారం.
3,522 Views