రేవంత్‌రెడ్డిపై కోడిగుడ్లతో దాడి
భూపాలపల్లి: భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
రేవంత్ సభలో మాట్లాడుతుండగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో కాటారం ఎస్‌ఐ శ్రీనివాస్ గాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. రేవంత్ గోబ్యాక్ అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే గండ్ర అనుచరులు పనేనంటూ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ”నాపై కోడిగుడ్లు వేయించడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి రా” అంటూ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ”నేను తలుచుకుంటే నీ ఇల్లు కూడా ఉండదు” అంటూ రేవంత్ మండిపడ్డారు.
భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఉద్రిక్తత….
భూపాలపల్లిలో రేవంత్ పై టమోటా, కోడి గుడ్లు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు…
నాపై టమోటాలు కోడిగుడ్లు వేసుడు కాదు…
దమ్ముంటే నువ్వు ఇక్కడికి రా…
నేను తలుచుకుంటే.. నీ ఇల్లు కూడా ఉండదు…
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై రేవంత్ ఫైర్…
జిల్లా ఎస్పీపైన నిప్పులు చెరిగిన రేవంత్…
గండ్ర నీకు చుట్టం కావచ్చు..నీ గుడ్డలు ఊడే సమయం వచ్చింది…
భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.