
తెలంగాణ గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి చనిపోయిందా? కావాలని అంతమోందించారా?: నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ప్రశ్నలవర్షం కురిపించింది.
గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి నాయక్ ని అన్యాయంగా పొట్టనపెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్
గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ పక్షాన మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వం అన్నివిధాలా ప్రీతి కుటుంబ సభ్యులను ఆదుకొని నేరస్థుణ్ణి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన NNHRF అధిష్టానం.

వివరాల్లోకి వెళ్ళితే, ఇంతకు తెలంగాణ గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి చనిపోయిందా? కావాలని అంతమోందించారా? అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి దీనిపై లోతుగా విచారణ జరిపించాలని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ చీఫ్ డాక్టర్ ప్రవీణ్ రావు అనుమానం వ్యక్తం చేశారు.
ఎప్పుడో చనిపోయిన మెడిసిన్ స్టూడెంట్ డాక్టర్ ప్రీతిని ప్రాణంతో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులను యావత్ లంబాడా సామాజిక ప్రజల్ని మభ్యపెట్టి వైద్యం అందిస్తున్నట్లు ఒక డ్రామాను సృష్టించి నమ్మించారు. ఈ కుట్రలో భాగంగా చాలా పెద్దతలకాయలు ఉన్నాయి కాబట్టి డాక్టర్ ప్రీతి బ్రతికితే అందరి బండారం బయటికి వస్తుందని బ్రతికించకుండా అన్యాయంగా సజీవంగా ఒక గిరిజన బిడ్డను పొట్టనపెట్టుకున్న ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కేటీఆర్ కి హరీష్ రావు కి మరియు మొహమ్మద్ అలీకి చెరగని ముద్రగా ఒక అమాయమైన గిరిజన బిడ్డను చంపినందుకు గిరిజన లంబాడీ ప్రజలు ఎప్పటికి మరిచిపోకుండా గుర్తుపెట్టుకుంటారని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ చీఫ్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
భారత దేశములోనే ఏ రాష్ట్రాములోకూడా చేయని గొప్ప చురుకైన పాత్ర తెలంగాణ పోలీసులు పోసిస్తున్నారంటే సామాన్య ఎస్సి ఎస్టీ బిసి మైనారిటీ సామాజిక ప్రజలు నిజమేకదా అనుకున్నారు,
నిజమేకదా అని మురిసిపోయిన అమాయకులు నమ్మించి గొంతుకోస్తారని పసికట్టలేకపోయారు. అంతేకాదు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి మరియు సామాన్యు ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి సహకరిస్తూ అవినీతిపై అన్యాయంపై పోరాడే నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ మరియు ప్రజా సంఘాలు కూడా కావచ్చు అనుకుని సంతోషించాయి. కానీ సత్యాన్ని, నిజాన్ని సమాధిచేస్తూ, ప్రజల కండ్లల్లో కారం చల్లి, వారు ఆ మంటకు కండ్లుతేరువలేని వాతావరణం సృష్టించి, కండ్లుతేరిచక చూస్తే చాలా నష్టం జరిగిపోతుంది అనేది వరంగల్ వైద్య విద్యార్థి డాక్టర్. ప్రీతి ఉదాంతం సామాన్యుడు కండ్లుతేరుచుకునేలా చేసింది అనుట్లో అతిశయోక్తిలేదు అని డాక్టర్ ప్రవీణ్ రావు ఘాటుగా మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో నేషనల్ ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మాట్లాడుతూ, జరుగుతున్న అనేక నేరాలను అరికట్టి ప్రజలకు రక్షణ కలిపించవలసిన తెలంగాణ తెలుసులు
ఫ్రైండ్లీ పోలీసులు అని గొప్పగా చెప్పినప్పుడు నిజమేకావచ్చు అని ప్రతి సామాన్యుడు సంబరపడిపోయాడు. కానీ అది సత్యానికి చాలా దూరంగా ఉంది వీళ్ళు చెప్పేమాటలని చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, సజీవంగా మనిషిని చంపి సమాధిచేస్తారని ఈ మధ్యలో ఓ పేదవాడు మైనారిటీ సామాజిక తెగకు చెందిన ఖదర్ ఖాన్ లాకప్ డెత్ సంఘటన పోలీసుల రాక్షసత్వాన్ని అద్దంపడుతుంది.

నూటికి నూరుశాతం దీన్ని హత్యగానే ఖండిస్తున్నాము. మావన హక్కుల ఉల్లంగానగా పోలీసుల తీరుపై మాయని మచ్చగా తెలంగాణ పోలీసులు కొనితేచ్చుకున్నారు. అత్యంత చురుకైన పోలీస్ వ్యవస్థ ఉందని ప్రభుత్వ పెద్దలు చెప్పగా ప్రజలు విన్నారు చూశారు కానీ అదంతా కేవలం రాతలకే మాటలకే అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదో మోసపురితమైన మాటగానే చరిత్రలో నిలిచిపోతుంది. కానీ కార్యరూపంలో మాత్రం సూన్యమనేది అక్షరాల సత్యమని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మీడియాకు తెలిపారు.
రోజురోజుకి నేరాల శాతం తగ్గాలి గాని పెరుగుతూ పోతుంది. కారణమేంటి? పోలీస్ అధికారులు డ్యూటీ చేయడంలేదా? కచ్చితంగా ప్రతి పోలీస్ అధికారి తన డ్యూటీ తాను చేస్తాడు, చేస్తున్నాడు కూడా… ఎందుకంటే ఎంతగానో కస్టపడి చదువుకొని పైకివచ్చిన వానికి రాజ్యాంగం, చట్టం, న్యాయవ్యవస్థపై గౌరవం, భయం కచ్చితంగా ఉంటుంది. ఏది తప్పు ఏది తప్పుకాదు అనేది బహటంగా ఎరిగిన అధికారులకు ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగాలకు భయపడి ఏ రాజకీయ నాయకుడు బెదిరిస్తే వారి మాటలకు లొంగిపోయి వారికి బానిసలుగా మారిపోతుంటారు.
కానీ అది చాలా తప్పు ఎవడో చేసిన పాపంలో పాలుపంచుకోవలసిన అవసరంగాని, సందర్భముగాని నీతినిజాయితీగా వారి బాధ్యతలు నిర్వహించే ప్రతి అధికారికి ఎప్పుడు రాదు.
కానీ ఇదే క్రమములో అన్యాయం చేస్తుపోతే, ఏదో ఒకరోజు చట్టం ముందు సమాజంలో తలదించుకోకతప్పదు. ప్రభుత్వాలు ఇవ్వాళా ఉంటాయి రేపుపోతాయ. ఉద్యోగంలో ఉన్నప్పుడు కలిపించిన సకల సౌకర్యాలు అనుభవించే ఉద్యోగికి కచ్చితంగా అవినీతితో సంపాదించినవి తరిగిపోతాయి. కానీ చేతికి అప్పగించిన బాధ్యతల్లో పరిస్థితులకు తలవంచక నమ్మకంగా రాజ్యాంగ బద్దంగా పని చేయగలిగితే ప్రజల గుండెల్లో చిరంజీవులుగా చిరకాలం నిలిపోతారు అనేది పచ్చినిజం. అట్టి వారికి ఈ ప్రపంచంలో ఏ శక్తికూడా వారి నిజాయతీని అడ్డుకోలేరు. అడ్డుకున్న తాత్కాలికమే తప్ప వారి వలన ఒరిగేది ఏమి ఉండదని డాక్టర్ పీటర్ నాయక్ గుర్తుచేశారు.
అయితే నేడు జరుగుతున్న పరిస్థితులు అలకాదు, మనుష్యులనుబట్టి అంతరాత్మకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఎదుటి మనిషి ప్రాణంపోతుంటే, నన్ను ఎవరైన బ్రతికిస్తే బాగుండును అని ఎదుటివ్యక్తి జీవానికి మరణానికి మధ్యలో కొట్టుమిట్టడుతుంటే వారిని చూస్తుకూడా వారిని బ్రతికించవలసిన పోలీసులు, రాజకీయ వ్యవస్థ మొత్తం ఏకమై, డాక్టర్ ప్రీతి బ్రతికిపోతే అసలు పెద్దతలకాయల బండారం ఎక్కడ బయటికి వస్తే అందరు జైలు పాలు అవుతామని భయంతో కావాలని చంపడానికి కంకణం కట్టుకున్నవాళ్లు కొకల్లలు. ఎక్కడ చిక్కుల్లో ఇరుక్కుంటానని బ్రతకడానికి అవకాశం ఉన్నాకూడా పరోక్షంగా హత్యలు చేసి ఏదో సాధించినట్లు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు .
ఈ క్రమములో వారు మాట్లాడుతూ నేటి రాజకీయ వ్యవస్థలో వారిపని వారిని చేయనివ్వకుండా అడుగడుగున వారిపై ఒత్తిడి పెడుతూ, వింటే మంచిది వినకపోతే ట్రాన్సఫర్ చేయడం అవసరమైతే నీతినిజాయితీ గల ఆఫీసర్లను టార్గెట్ చేయడం వారిని త్రోక్కివేయడంలాంటివి చట్టయురుద్ధముగా ముందుకెళ్ళడంలాంటివి చేస్తున్నారనేది అక్షరాల సత్యం అని డాక్టర్ ప్రవీణ్ రావు పేరుకున్నారు.
ఈ క్రమములో కొందరు ఉద్యోగంకంటే ఆత్మభిమానమే గొప్ప అనుకునే ఆఫీసర్స్ వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ వారి ఉద్యోగాన్ని సహితం త్యాగం చేసి సమాజంలో సామాన్య ప్రజలపక్షాన నిలబడి వారికంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నవారుకూడా లేకపోలేదు. మరికొన్ని కేసుల్లో పోలీసులే చట్టాన్ని మత చేతుల్లో తీసుకొని నిలువునా మనిషిని చెంపేస్తున్నారు. దానికి తుతుమంత్రంగా సస్పెండ్స్, తొలిగించినట్లు మీడియా కవరేజ్. అసలు ఎటుపోతుంది రాజకీయ వ్యవస్తా? అమాయకమైన ప్రజల్ని వేధించడానికా? ప్రజలు మిమ్ములను ఎన్నుకున్నది అని డాక్టర్ పీటర్ నాయక్ మండిపడ్డారు.
చట్టం ముందు అందరు సమానమే అంటూ 365 రోజులు ప్రతి సందర్భంలో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకొరకు కాదు ప్రజలు రాజకీయ నాయకుల్ని ఎన్నుకున్నది. వారికి కష్టం వస్తే రక్షణ కవచంగా ఉంటారని నమ్మి ఉన్నంతస్థానంలో కూర్చోబెట్టారు. కానీ నేటి పాలకులు ప్రజలు చస్తుంటే చూస్తున్న ప్రజాప్రతినిధులుగా చరిత్రలో నిలిచిపోతారు. కానీ వీరి వళ్ళ ఒరిగిందేమి లేదని రేపటి పౌరులు చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది. అంతే కాదు స్వార్ధపురితమైన నాయకుల్నిబట్టి నేడు బడుగుబలహీన వర్గాలు నరకయాతన అనుభవిస్తున్నారు. అందుకే దినదినం రాజకీయ నాయకులను గుర్తుచేస్తేనే వాళ్ళ గురించి మాకు తెలుసులే అని మొఖంచాటేస్తున్నారు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. మాకేందుకులే అన్నట్లు కొన్నిచోట్ల కేసుకువచ్చేవారిని చాలా చిన్నచూపుచుస్తూ, సామాన్యులకు అందాల్సిన న్యాయం అందకుండాపోతోంది. మెడిసిన్ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బుల్టిన్ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాల్సిన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ విషయంలో ఏమైంది ఎలా ఉంది బయటికి చెప్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని నిజాన్ని సమాధి చేస్తువచ్చారు . కానీ ఇలా నిర్లక్ష్యం చేయడంవలన సమస్యలు ఎక్కువగా అయ్యే సూచనలు చాలా ఉన్నాయి.
ప్రీతిని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ది కొరకు ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు ఇది చాలా బాధాకరం. ఒకరేమో కులంపేరుతో రాజకీయం చేస్తారు. ఇది సందర్భమా? మానవత్వన్ని మంటగలిపే రాజకీయాలు ప్రక్కకుపెట్టాలి ఒకవేళ రాజకీయా కోణంనుండే మాట్లాడుతాము అనుకునేవాళ్లు దయచేసి మీరు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. ఇంకొకరు మతంపేరుతో చావుబ్రతుకులమధ్యలో ఉన్న డాక్టర్ ప్రీతిని అడ్డుపెట్టుకొని మాట్లాడుతున్నారు, ఇది న్యాయమా? అవునులే అసలు న్యాయం ఎలా ఉంటదో తెలుస్తేకదా! ఎదుటివారి ఆవేదన అర్ధమైయ్యేది…! ఈ నేపథ్యంలో అత్యంతా బాధ్యతయుతమైన హోదాలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఏకంగా పూలదండలే తీసుకొని వచ్చారు అంటే, ప్రీతికి సంబందించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని చెప్పకనే చేదు నిజాన్ని సమాధి చేస్తూ యావత్ లంబాడా సామాజిక ప్రజల మనోభావాలతో ఆటలు ఆడుకుంటున్నారని చాలా క్లియర్ గా అర్ధమైతుంది..
పోలీస్ వ్యవస్థలో బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వరంగల్ పోలీస్ కమీషనర్ మాత్రం డాక్టర్ ప్రీతిని నేరస్తుడు మానసికంగా వాట్సాప్ మెసేజెస్ ద్వారా వ్యక్తిగతంగా ప్రీతిని హీనంగా కించపరుస్తూ, అవమానించాడని మీడియా ముందుచెప్పారు. అలాంటప్పుడు మరోప్రక్క జూనియర్ డాక్టర్స్ ఆడపిల్లపై సానుభూతి చూపకపోయినా పర్వాలేదు కానీ నేరస్థుని పక్షాన ఆందోన చేయడం ఎంతవరు న్యాయం? ఇదంతా చూస్తుంటే ప్రీతి చనిపోయింది కాబట్టి కచ్చితంగా ఎస్సి ఎస్టీ ప్రీవెన్స్ ప్రకారం నేరస్థునికి శిక్షపడుతుందని ఆడుతున్న నాటకం కాదా? అవును కచ్చితంగా ఇదో పెద్ద కుట్రగానే భావిస్తున్నాను. వరంగల్ పోలీస్ కమీషనర్ చెప్పినట్లు వేధించినట్లు మీడియా సమావేశంలో పేరుకున్నారు కదా! ఇంతకి ఎవరి స్టేట్మెంట్ నిజం? మేము అరెస్ట్ చేశాము కోర్టుకి హాజరు పరిచాము అన్నారు ఈ క్రమంలో ఎందుకు జూనియర్ డాక్టర్స్ ని ఒప్పించలేకపోయారు?
మీడియానైతే మొత్తం ఏమి తెలియనట్లు ఇంత సునీతమైన విషయాన్ని చూపించకుండా నోరుమూసుకుంది. అదే ఉన్నతమైన వర్గాల్లో ఇటువంటి సంఘటన జరుగుతే మాత్రం గంటల్లో అరెస్టులు 24నుండి 72 గంటల్లో ఎన్కౌంటర్ చేస్తారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా సమానత్వం?
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎస్సి ఎష్టి బిసి మైనారిటీ సామాజిక ప్రజలకు కచ్చితంగా న్యాయం జరగదు అనే సందేశాన్ని పరోక్షంగా చూపిస్తున్న వివక్షనుబట్టి సుస్పష్టంగా అర్ధమౌతుంది.
ప్రజాస్వామ్యంలో ఎస్సి ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలు చాలా ప్రమాదం ఉన్నాయి ఇక్కడి ప్రజాప్రతినిధులు పోలీసులను, కోర్థులను, యావత్ న్యాయవ్యవస్థనే తప్పుదోవపట్టిస్తున్నారు అనేది అక్షరాల సత్యం.
ఏది ఏమైన బడుగుబలహీన వర్గాలు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని జరుగుతున్న పరిస్థితులనుబట్టి నూటికి నూరు శాతం కండ్లకు కట్టినట్లుగా అర్ధం అవుతున్న తీరుని బట్టి ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరు కాపాడారు ఎవరికి వారే మేలుకొని రాక్షషులను నుండి జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత నేటి ఎస్టీ ఎస్సి బిసి మైనారిటీ ప్రజలపై ఉందని డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మరియు నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ డాక్టర్ ప్రవీణ్ రావు ముందు జాగ్రత్త కొరకు ప్రజలకు పిలుపునిచ్చారు…